‘యూరియా కొరత లేదు’

ABN , First Publish Date - 2020-08-15T10:09:16+05:30 IST

ప్రస్తుత వానాకాలం వ్యవసాయ సీజన్‌లో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌

‘యూరియా కొరత లేదు’

వైరా, ఆగస్టు 14: ప్రస్తుత వానాకాలం వ్యవసాయ సీజన్‌లో రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎక్కడా యూరియా కొరత లేదని రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌చైర్మన్‌, వైరా సొసైటీ అధ్యక్షుడు బొర్రా రాజశేఖర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం వైరా సొసైటీ కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ యూరియా కొరత రాదని పేర్కొన్నారు.


కేసీఆర్‌ నాయకత్వంలో రైతుల సంక్షేమం ఆర్థిక పరిపుష్టి దిశగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సొసైటీల ద్వారా యూరియాను ఎప్పటికప్పుడు రైతులకు సరఫరా చేస్తున్నామని వివరించారు.  వైరా ఏవో ఎస్‌.పవన్‌కుమార్‌, సీఈవో నర్సింహారావు, మాచవరపు అప్పారావు, డైరెక్టర్లు తాతా బసవయ్య, తేజావత్‌ రామకృష్ణ, బొల్లేపోగు శ్రీను, కొప్పుల వెంకటేశ్వరరావు, యన్నం వెంకటకోటారెడ్డి, వనమా చిన్నసత్యనారాయణ, దొంతెబోయిన వెంకటేశ్వర్లు, ధనలక్ష్మీ పాల్గొన్నారు.

Updated Date - 2020-08-15T10:09:16+05:30 IST