దళితుల జోలికి వస్తే సహించేది లేదు

ABN , First Publish Date - 2021-07-30T06:04:36+05:30 IST

దళితుల జోలికొస్తే సహించేదిలేదని సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. మాజీమంత్రి ఈటెల

దళితుల జోలికి వస్తే సహించేది లేదు
సూర్యాపేటలో ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న దళిత సంఘాల నాయకులు

సూర్యాపేట అర్బన్‌/ తిరుమలగిరి/ అర్వపల్లి/ నూతన్‌కల్‌/ మద్దిరాల, జూలై 29: దళితుల జోలికొస్తే సహించేదిలేదని సూర్యాపేట మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి దళితులను దూషించినందుకు నిరస నగా జిల్లాకేంద్రంలో ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మను గురువారం దహ నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి పాటుపడుతోందని, కేవలం ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తుకొస్తున్నారని అనడంలో అర్థం లేదన్నారు. దళితబంధు పథకాన్ని మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్‌ సమక్షంలోనే ప్రారంభించారన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి బిక్షం, కౌన్సిలర్‌ చింతలపాటి భరత్‌మహాజన్‌, నాయకులు తల్లమల్ల హుస్సేన్‌, మధు ఉన్నారు. మాజీమంత్రి బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ తిరుమలగిరిలో ఆయన దిష్టి బొమ్మను దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో దళిత నాయ కులు కందుకూరి లక్ష్మ య్య, కందుకూరి ప్రవీణ్‌, రమేష్‌, పోతరాజు కృష్ణ, పత్తెపురం త్రిశూల్‌, పల్లీల్‌ రంజిత్‌, శాగంటి, నవీన్‌, పవన్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. దళితుల పట్ల అగ్రకుల నాయకులు వివక్ష చూపితే సహించేది లేదని దళిత సంఘం నాయకుడు ఈదుల వీరపాపయ్య హె చ్చరించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి దిష్టిబొమ్మను అర్వపల్లిలో దహనం చేశారు. కార్యక్రమంలో నాయకులు తిరుమల్‌, రవి, శైలేందర్‌, విద్యాసాగర్‌, లక్ష్మయ్య, లింగయ్య, రామకృష్ణ, నర్సయ్య, సత్త య్య పాల్గొన్నారు. దళితులను ఉద్దేశించి ఈటల రాజేందర్‌ బావమరిది మధుసూదన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నూతన్‌కల్‌లో టీఆర్‌ఎస్‌ ఎస్సీసెల్‌ నా యకులు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు బత్తుల విజయ్‌కుమార్‌, ఇరుగు మధు, నకిరే కంటి వెంకన్న, చిరంజీవి, ఇస్తారి, హరికృష్ణ, మురళీ ఉన్నారు. మద్దిరా లలో టీఆర్‌ఎస్‌ ఎస్సీసెల్‌ నాయకులు గోల్కొండ మల్లేష్‌, నాగరాజు, రవి, వెంకన్న, గిరి, మురళీ, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:04:36+05:30 IST