సేవ కన్నా మించింది ఏదీ లేదు

ABN , First Publish Date - 2021-10-28T04:41:23+05:30 IST

సమాజంలో సేవా కార్యక్రమాల కన్నా మించినది ఏదీ లేదని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు పంపిణీదారు ఆనందయ్య పేర్కొ న్నారు.

సేవ కన్నా మించింది ఏదీ లేదు
ప్రజలకు కరోనా మందు పంపిణీ చేస్తున్న సీతాదయాకర్‌రెడ్డి దంపతులు

- కృష్ణపట్నం ఆనందయ్య


కొత్తకోట, అక్టోబరు 27: సమాజంలో సేవా కార్యక్రమాల కన్నా మించినది ఏదీ లేదని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కరోనా ఆయుర్వేద మందు పంపిణీదారు ఆనందయ్య పేర్కొ న్నారు. బుధవారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే సీతమ్మ జన్మదిన వేడుకల్లో భాగంగా సీతా దయాకర్‌రెడ్డి దంపతులు నియోజకవర్గ ప్రజలకు ఆనందయ్యతో కరోనా మందును ఉచి తంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆనందయ్య మాట్లాడుతూ ఆయుర్వేదానికి భారత దేశం పుట్టినిల్లని, వంశపారంపర్యంగా తయారు చేస్తున్న మందులను ప్రభుత్వం గుర్తించి బాధితులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయుర్వేదంలో సర్వ రోగాలకు మందులు ఉన్నాయని, ఇంగ్లీష్‌ మందులు వచ్చాక గుర్తింపు తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతకు ముందు సీతమ్మ కేక్‌కట్‌ చేయగా అభిమానులు దంపతులిద్దరిని పూల మాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రజలకు కరోనా మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో గద్వాల మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రమాదేవి, టీడీపీ నా యకులు గంజి రాములు, మాసన్న, సుధామధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు, సుల్తాన్‌, గోక రయ్య, కిషన్‌ నాయక్‌, లక్ష్మీకాంత్‌రెడ్డి, బషీర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-28T04:41:23+05:30 IST