మోదీ, మమత కాకుండా దేశంలో మరో నేత లేరు: టీఎంసీ

ABN , First Publish Date - 2021-12-04T02:21:59+05:30 IST

నరేంద్రమోదీని దింపేస్తామని వాళ్లు (కాంగ్రెస్) అనుకుంటే, చేయనివ్వండి. మమతా బెనర్జీనే కావాల్సిన అవసరం లేదు. దేశానికి ఉన్న నష్టాన్ని ఎవరు తొలగించినా సంతోషమే. మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను కూల్చే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి..

మోదీ, మమత కాకుండా దేశంలో మరో నేత లేరు: టీఎంసీ

కోల్‌కతా: దేశంలో ఇద్దరు నాయకులు మాత్రమే ప్రస్తుతం ఉన్నారని, ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాగా మరొకరు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీయని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత మదన్ మిత్ర అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కాదని, కాంగ్రెస్ వల్లే బీజేపీ అధికారాన్ని కొనసాగించగలుగుతోందని, బీజేపీని ఓడించాలంటే మమత నాయకత్వం కావాల్సిందేనని ఆయన అన్నారు. శుక్రవారం రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


‘‘నరేంద్రమోదీని దింపేస్తామని వాళ్లు (కాంగ్రెస్) అనుకుంటే, చేయనివ్వండి. మమతా బెనర్జీనే కావాల్సిన అవసరం లేదు. దేశానికి ఉన్న నష్టాన్ని ఎవరు తొలగించినా సంతోషమే. మమతా బెనర్జీ కాంగ్రెస్‌ను కూల్చే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత. కానీ, మోదీని అధికారం నుంచి దించే సత్తా కాంగ్రెస్‌కు లేదు. బీజేపీకి కాంగ్రెస్‌ అనువైన ప్రతిపక్షం. వీరిద్దరి వల్ల ఇంకో ప్రతిపక్షం ఎదగట్లేదు. అందుకే బీజేపీ ప్రత్యామ్నాయానికి మమత నాయకత్వం కావాలి. ఈ దేశంలో మోదీ, మమత మాత్రమే ప్రస్తుత నాయకులు. వీరిద్దరి మధ్యే యుద్ధం కొనసాగబోతోంది’’ అని మదన్ మిత్ర అన్నారు.

Updated Date - 2021-12-04T02:21:59+05:30 IST