Abn logo
Jun 16 2021 @ 04:15AM

థర్డ్‌వేవ్‌లో తీవ్రత ఉండకపోవొచ్చు

  • స్పానిష్‌ ఫ్లూ కూడా థర్డ్‌వేవ్‌ అంత తీవ్రంగా లేదు.. 
  • కొవిడ్‌కు ప్రతి ఏడాది టీకా బూస్టర్‌ డోస్‌ అవసరం!
  • కరోనా సోకితే.. ఒక డోస్‌తో 10 రెట్లు అధిక ప్రయోజనం
  • దేశంలో 100 కోట్ల మందికి టీకా అందితేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ
  • సీఎంఈ వెబినార్‌లో వైద్య నిపుణుల అభిప్రాయం
  • 41% మందిలో గుండె సంబంధిత సమస్యలు
  • కొవిడ్‌ వచ్చాక మధుమేహం ముప్పుపై ఆందోళన
  • తెలంగాణలో కట్టుదిట్టంగా ఎదుర్కొన్నాం: సీఎస్‌


హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌- 19 థర్డ్‌వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. స్పానిష్‌ ఫ్లూ విషయంలోనూ ఇదే జరిగిందని.. మొదటి రెండు వేవ్‌లతో పో లిస్తే, థర్డ్‌వేవ్‌ తీవ్రత తక్కువ అని గుర్తుచేశారు. భవిష్యత్‌లో కరోనా వైరస్‌ ఒక ఫ్లూ మాదిరిగా మారవచ్చని చెప్పారు. మున్ముందు వచ్చే వ్యాక్సిన్లు సింగిల్‌ డోస్‌గా ఉండాలని, అవి భవిష్యత్‌లో వచ్చే కొత్త వేరియంట్ల నూ సమర్థంగా అడుకోగలగాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌(టీఎ్‌సఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం కంటిన్యూయింగ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(సీఎంఈ)లో భాగంగా నిర్వహించిన వెబినార్‌లో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా, ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)చీఫ్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి, యశోద ఆస్పత్రి సీనియర్‌ జనరల్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ ఎంవి రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి సోమేశ్‌కుమార్‌, టీఎ్‌సఎంసీ చైర్మన్‌ డాక్టర్‌ రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


తొలుత డాక్టర్‌ గులేరియా మాట్లడుతూ 1918లో వచ్చిన మహమ్మారి స్పానిష్‌ ఫ్లూలో.. 1, 3వ వేవ్‌ల కంటే.. సెకండ్‌వేవ్‌ తీ వ్రంగా ఉందని గుర్తుచేశారు. కరోనా తీవ్రత కూడా ఇదేమాదిరిగా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. డెల్టా వేరియంట్‌లో రెండు రకాల మ్యూటేష న్లు ఉండడంతో..దాని ప్రభావం తీవ్రం గా కనిపించిందన్నారు. అన్నిరకాల కొవిడ్‌ వ్యాక్సిన్లు కరోనాను ఎదుర్కొ నే శక్తిని ఇస్తున్నాయని తెలిపారు. డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడు తూ సాధారణ ఫ్లూ మాదిరిగా నే ఇక ప్రతి సంవత్సరం కొ విడ్‌ టీకా బూస్టర్‌ డోసు వే సుకునే అవసరం ఉండొచ్చని అభిప్రాయపడ్డా రు. లక్ష్యం మేరకు వ్యాక్సినేషన్‌ పూర్తిచేస్తే.. కొవిడ్‌ తదుపరి దశల్లో తీవ్రతను తగ్గించవచ్చన్నారు. దేశంలో వంద కోట్ల మందికి టీకా అందితేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమని తెలిపారు. కొవిడ్‌ వచ్చిన వారికి ఒక్క డోసు వ్యాక్సిన్‌తోనే 10 రెట్లు అధికంగా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని, తమ పరిశోధనలో తేలిందన్నారు. ఏఐజీ వైద్యుడు డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా అత్యవసర శస్త్రచికిత్సలు చాలా వరకు వాయిదా పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో 41% మందికి గుండె సంబంధిత వ్యాధులు పెరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని ఏఐజీ సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ రాజీవ్‌ మీనన్‌ తెలిపారు. 


డాక్టర్‌ ఎంవీ రావు మాట్లాడుతూ.. కొవిడ్‌కు ముందు మధుమేహం లేనివారిలో చాలా మందికి.. ఆ తర్వాత షుగర్‌ వ్యాధి వచ్చిందన్నారు. బ్లాక్‌ఫంగ్‌సతో తమ ఆస్పత్రికి చికిత్సకు వచ్చిన వారిలో 90% మంది మధుమేహ బాధితులేనని సరోజినీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజలింగం వెల్లడించారు. 400 మం దిలో 59% మందికి శస్త్రచికిత్సలు అవసరమయ్యాయ ని చెప్పారు. గర్భిణులపై వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జ రగాల్సి ఉందని జేజే ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్‌ జయంతిరెడ్డి అన్నారు. బాలింతలు మాత్రం తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు. పిల్లలపై థర్డ్‌వే వ్‌ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, అయినా.. వారి కి వ్యాక్సినేషన్‌ అనుమతులు లేనందున జాగ్రత్తగా ఉండాలని రెయిన్‌బో ఆస్పత్రి పీడియాట్రిక్‌ ఇన్సెంటివ్‌ విభాగం వైద్యుడు డాక్టర్‌ ఫర్హాన్‌షేక్‌ అన్నారు. ఈ వెబినార్‌లో ఐసీఎంఆర్‌ అంటువ్యాధుల విభాగం డైరెక్టర్‌ డాక్టర్‌ రామన్‌ గంగోద్కర్‌, కాంటినెంటల్‌ ఆస్పత్రి చీఫ్‌ డాక్టర్‌ పీబీఎన్‌ గోయల్‌, అపోలో ఆస్పత్రి ఇన్ఫెక్షన్‌ డిసీజ్‌ స్పెషలిస్టు డాక్టర్‌ సునితా నర్రెడ్డి మాట్లాడారు.


సమర్థంగా ఎదుర్కొన్నాం: సోమేశ్‌కుమార్‌

తెలంగాణలో సర్కారు అప్రమత్తతతో కరోనాను సమర్థంగా ఎదుర్కొన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపారు. డైనమిక్‌ సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో.. వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయడంతోపాటు మరణాలను అదుపు చేసేలా ఆస్పత్రుల్లో వనరుల కల్పన, అదనపు పడకలు, ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు.