Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 12 2021 @ 01:19AM

వాతావరణ సంక్షోభానికి వ్యాక్సిన్ లేదు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కార్చిచ్చు కలవరపెడుతోంది. అమెరికా, గ్రీస్, అల్జీరియా, రష్యా తదితర దేశాల్లో బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథానమ్ ఆందోళన వ్యక్తం చేశారు. వినాశకరమైన మంటలు వేలాది మంది జీవితాలను ప్రభావితం చేసినట్టు పేర్కొన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడే సంక్షోబానికి వ్యాక్సిన్ లేదు అని వ్యాఖ్యానించారు. ‘కరోనా మహమ్మారిని అంతం చేయోచ్చు కానీ.. వాతావరణ సంక్షోభానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు’ అని పేర్కొన్నారు. 


Advertisement
Advertisement