Advertisement
Advertisement
Abn logo
Advertisement

యువతలో దేశభక్తి మెండుగా ఉండాలి

బహుమతుల పంపిణీలో స్టెప్‌ సీఈవో

కడప (మారుతీనగర్‌), నవంబరు 30: యువతలో దేశం పట్ల భక్తితో పాటు అభిమానం ఉండాలని స్టెప్‌ సీఈవో ఎం.రామచంద్రారెడ్డి తెలిపారు. నెహ్రూ యువకేంద్రం (కడప) ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక బాలాజీనగర్‌లోని యూత్‌ హాస్టల్‌లో యువతకు సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌,  సబ్‌ కా విశ్వాస్‌ అనే అంశంపై జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఇందులో జె.అరుణ, ఎం.రూప, ఎస్‌.సానియా, ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల కింద 5 వేలు, 2 వేలు, వెయ్యి రూపాయలతో పాటు ప్రశంసాపత్రాలను అందుకున్నారు. కార్యక్రమంలో ఎన్‌.ఎ్‌స.ఎస్‌. పి.ఓ.సుబ్బనరసయ్య, న్యాయనిర్ణేతలుగా శ్రావణి, ఇందిరా, డి.వెంకటసుబ్బయ్య వ్యవహరించగా పోటీలకు సుమారు 50 మంది పాల్గొన్నారు. 

Advertisement
Advertisement