Advertisement
Advertisement
Abn logo
Advertisement

చాణక్య నీతి: మీరు ఉద్యోగంలో వృద్ధి.. వ్యాపారంలో లబ్ధి లేదని చింతిస్తున్నారా? అయితే ఈ నాలుగు సూత్రాలతో మీ పంట పండినట్లే!

ఆచార్య చాణక్య గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. తన జీవితకాలంలో అనేక అసాధ్యమైన పనులను సుసాధ్యం చేసి చూపించాడు. ఫలితంగా శత్రువులు కూడా అతని ముందు మోకరిల్లాల్సి వచ్చింది. ఆచార్య తాను అనుసరించి, మనకు చెప్పిన విధానాలు, పెంపొందించుకోవాల్సిన దూరదృష్టి, సామాజిక పరిజ్ఞానం ఈనాటికీ అనుసరణీయమై ఉన్నాయి. ఉద్యోగంలో వృద్ధి.. వ్యాపారంలో లబ్ధికి చాణక్య చెప్పిన నాలుగు సూత్రాలివే.. 

మీ పని విషయంలో మీరు అంకితభావం కలిగివుండటం మీ విజయానికి మొదటి సంకేతం. మీరు మీ పని పట్ల అజాగ్రత్తగా ఉంటే, మీరు ఏ రంగంలోనైనా అనుకున్న ఉత్తమ ఫలితాలను సాధించలేరు. అటువంటి పరిస్థితిలో మీరు ఉద్యోగంలో లేదా వ్యాపారంలో అపజయాలను ఎదుర్కొంటారు. జీవితంలో ముందుకు సాగాలన్నా, పురోగతి సాధించాలన్నా పని విషయంలో అంకితభావంతో మెలగడం చాలా ముఖ్యం.

కొంతమంది అదృష్టాన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే భగవంతుడు మనిషికి పని అనే కర్తవ్యాన్ని అందించాడు. అందుకే పనిలోని కష్టానికి భయపడకుండా, పూర్తి అంకితభావంతో కర్తవ్యాన్ని నెరవేర్చాలి. మన కష్టంతో దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చుకోవచ్చు. ఇష్టంగా కష్టపడి మీ కలలను నెరవేర్చుకోవడానికి ధైర్యంగా మెలగండి.

ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయం అతని జీవితాన్ని ఉద్దరించవచ్చు లేదా దిగజార్చనూ వచ్చు. అందుకే ఏ నిర్ణయాన్ని అయినా చాలా జాగ్రత్తగా తీసుకోండి. అందుకోసం అనుభవజ్ఞులైనవారి  నుంచి సలహా తీసుకోండి. అలాగే అపజయం పాలయిన వ్యక్తుల నుంచి కూడా సలహా తీసుకోండి. ఈ రెండింటినీ అర్థం చేసుకోండి. తరువాత మనం చేయూలనుకుంటున్న పనికి సంబంధించిన వ్యూహాన్ని రూపొందించి తగిన నిర్ణయం తీసుకోండి. ఇతరుల మాటలు వినండి. అయినా మీ స్వంత విచక్షణతో నిర్ణయం తీసుకోండి. మీరు సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటే, సాధించలేనిది ఏదీ లేదు.

జీవితంలో డబ్బు సంపాదించినా అది నిలవడంలేదని మీకు అనిపిస్తుంటే.. దీనికి కారణం మనం డబ్బును వృథాగా ఖర్చుపెట్టామని గుర్తించాలి. అందుకే మీ డబ్బును రాబడివచ్చే చోట్ల పెట్టుబడి పెట్టండి. ధార్మక పనులలో కూడా వినియోగించండి. అప్పుడు మీకు అదృష్టం కలసివస్తుంది. డబ్బు, కీర్తి పెరుగుతాయి. అర్థాంతరంగా ఆగిపోయిన పనులు కూడా సులభంగా ముందుకుసాగుతాయి. ఆచార్య చాణక్య.. ఒక వ్యక్తి జీవితంలో శ్రమతో పాటు అదృష్టం కూడా ప్రత్యేక పాత్ర పోషిస్తుందని నమ్మాడు, అందుకే మీ కర్తవ్యాన్ని నెరవేర్చడంతో పాటు ధార్మికపరమైన పనులను కూడా చేయండి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement