పురాతన రాళ్ల వంతెనలివి!

ABN , First Publish Date - 2021-07-14T05:01:19+05:30 IST

చిన్న చిన్న సెలయేర్లు... వాటిని దాటడానికి రాళ్ల వంతెనలు... వెరసి పర్యాటకులకు కనువిందు చేసే ప్రదేశాలు. సిమెంటు, స్టీల్‌తో పనిలేకుండా నిర్మించిన ఈ వంతెనలను క్లాపర్‌ బ్రిడ్జెస్‌ అంటారు.

పురాతన రాళ్ల వంతెనలివి!

చిన్న చిన్న సెలయేర్లు... వాటిని దాటడానికి రాళ్ల వంతెనలు... వెరసి పర్యాటకులకు కనువిందు చేసే ప్రదేశాలు. సిమెంటు, స్టీల్‌తో పనిలేకుండా నిర్మించిన ఈ వంతెనలను క్లాపర్‌ బ్రిడ్జెస్‌ అంటారు. బ్రిటన్‌లో కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించిన అలాంటి వంతెనలు ఇప్పటికీ కనిపిస్తాయి. పెద్ద పెద్ద రాళ్లను వంతెనగా నిర్మించుకున్న తీరు ఆకట్టుకుంటుంది.  


ఎక్స్‌మూర్‌ నేషనల్‌ పార్క్‌లో ఉన్న అలాంటి వంతెనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ క్లాపర్‌ బ్రిడ్జ్‌ పొడవు 55 మీటర్లు. ఈ తరహా వంతెనల్లో ఇది పొడవైనది. 

ఈ వంతెన కింద నీరు తక్కువ ఎత్తులో నెమ్మదిగా పారుతుంది. అయితే నదికి వరదలు వచ్చినప్పుడు మాత్రం వంతెన కనిపించదు. చాలా సార్లు వరద ప్రవాహానికి రాళ్లు కొట్టుకుపోయాయి. అయితే సిబ్బంది తిరిగి రాళ్లతో వంతెనను పునరుద్దరిస్తుంటారు. పురాతన వంతెనలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో వెంటనే మరమ్మతులు చేస్తుంటారు. వీటిని సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారు.

Updated Date - 2021-07-14T05:01:19+05:30 IST