లాక్‌డౌన్‌లో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసినవివే...

ABN , First Publish Date - 2020-08-01T00:16:00+05:30 IST

కరోనా నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్ వేళ... జనం ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్‌లకు ఎగబడ్డారు. ఈ క్రమంలో... ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయారు. సినిమాలు, వీడియోలు చూస్తూనే... ఆన్‌లైన్‌లో ఏం కొన్నారనే విషయమై తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర వివరాలను వెల్లడించింది.

లాక్‌డౌన్‌లో భారతీయులు ఎక్కువగా కొనుగోలు చేసినవివే...

న్యూఢిల్లీ : కరోనా నేపధ్యంలో విధించిన లాక్‌డౌన్ వేళ... జనం ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్‌లకు ఎగబడ్డారు. ఈ క్రమంలో... ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లకు అతుక్కుపోయారు. సినిమాలు, వీడియోలు చూస్తూనే... ఆన్‌లైన్‌లో ఏం కొన్నారనే విషయమై తాజాగా జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర వివరాలను వెల్లడించింది.


భారతీయులు లాక్‌డౌన్ వేళ... 55 శాతం మంది... కిరాణా వస్తువులను కొన్నారని తెలిపింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి వీలు లేకపోవడంతో చాలామంది ముందుగానే కిరాణా సామాన్లు తెచ్చుకున్నారు. నిత్యావసరాలను కూడా ఆన్‌లైన్‌లోనే తెప్పించుకున్నారు. ఇక... 53 శాతం మంది దుస్తులను కొనుగోలు చేశారు.


ఆన్‌లైన్‌లో దుస్తులను ఎక్కువగా యువతే బుక్ చేశారని సర్వే వెల్లడించింది. మరోవైపు 50 శాతం మంది... ఎలక్ట్రానిక్ వస్తువులు కొన్నారని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. అలాగే ఆన్‌లైన్ ద్వారా ఔషధాలను 44 శాతం మంది తెప్పించుకున్నట్టు వెల్లడించింది. ఇక... లాక్‌డౌన్ సమయంలో ప్రజలు ఎక్కవగా ఇంటర్‌నెట్‌లో సెర్చ్ చేసిన వివిధ రంగాల గురించి కూడా అధ్యయనం పేర్కొంది.


అరవై శాతం మంది... ఆన్‌లైన్‌లో వాహనాల కోసం సెర్చ్ చేయగా... ప్రయాణాలు, టికెట్ బుకింగ్‌ల కోసం 40 శాతం మంది వెదికారని వెల్లడించింది. మరోవైపు... కొత్త వాహనాలను కొనుగోలు చేస్తే... ఏ బ్రాండ్ వాహనాలు బాగుంటాయన్న విసయమై యువత ఎక్కువగా ఆన్‌లైన్ లో శోధించారు. 

Updated Date - 2020-08-01T00:16:00+05:30 IST