ట్రంప్ హయాంలో భారీగా సంపాదించింది వీరే..!

ABN , First Publish Date - 2020-11-19T22:11:17+05:30 IST

మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో కొందరి సంపద విలువ భారీగా పెరిగింది. బిలియనీర్లు మరింత బిలియనీర్లుగా ఎగబాకారు. ఇలా ట్రంప్ కాలంలో సంపద విలువ ఎక్కువగా పెరిగిన వారు ఎవరెవరంటే...

ట్రంప్ హయాంలో భారీగా సంపాదించింది వీరే..!

న్యూయార్క్ : మరికొద్ది రోజుల్లో పదవిని వీడనున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో కొందరి సంపద విలువ భారీగా పెరిగింది. బిలియనీర్లు మరింత బిలియనీర్లుగా ఎగబాకారు. ఇలా ట్రంప్ కాలంలో సంపద విలువ ఎక్కువగా పెరిగిన వారు ఎవరెవరంటే...

డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి, అంటే 2016 నుంచి... ఇప్పటివరకు ఎవరెవరు బాగా సంపాదించారన్న విషయమై ఫోర్బ్స్ పత్రిక ఓ జాబితాను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి. 


అమెజాన్ ఫౌండర్, సీఈవో జెఫ్ బెజోస్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 189 బిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఈయన సంపద విలువ ఏకంగా 121 బిలియన్ డాలర్ల మేరకు పెరగడం విశేషం. తర్వాతి స్థానంలో ఎలాన్ మాస్క్ ఉన్నారు. స్పెస్ ఎక్స్, టెస్లా సంస్థలకు బాస్ అయిన ఈయన సంపద విలువ 90 బిలియన్ డాలర్లు. ఈయన సంపద విలువ 2016 నుంచి  79 బిలియన్ డాలర్లు పెరిగింది.


ఇక మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో స్టీవ్ బల్మర్ మూడో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద 73 బిలియన్ డాలర్లు. ఈయన సంపద విలువ 2016 నుంచి చేస్తే 44 బిలియన్ డాలర్లకు పెరిగింది. నాల్గవ స్థానంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఈయన సంపద విలువ 99 బిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఈయన సంపద విలువ 44 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇక... ఐదో స్థానంలో క్వికెన్ లోన్స్ ఫౌండర్ డాన్ గిల్బర్ట్ నిలిచారు. ఈయన సంపద 44 బిలియన డాలర్లు. ఈయన సంపద విలువ 2016 నుంచి 39 బిలియన్ డాలర్లు పెరిగింది. కాగా... మైక్రోసాఫ్ట్ అధినేత  బిల్‌గేట్స్ ఆరో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 117 బిలియన్ డాలర్లు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఈయన సంపద విలువ 35 బిలియన్ డాలర్లు పెరిగింది.


ఇక వాల్‌మార్ట్‌కు చెందిన ఎలైస్ వాల్టన్ సంపద విలువ 67 బిలియన్ డాలర్లు. ఈమె ఏడో స్థానంలో నిలిచారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఈమె సంపద విలువ 33 బిలియన్ డాలర్లు పెరిగింది. వాల్‌మార్ట్‌కు చెందిన జిమ్ వాల్టన్ 8 వ స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ 32 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇప్పుడీయన సంపద 67 బిలియన్ డాలర్లు. ఇక వాల్‌మార్ట్‌కే చెందిన రాబ్ వాల్టన్, ఒరాకిల్ కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ 9, 10 స్థానాల్లో ఉన్నారు. వీరి సంపద విలువ వరుసగా 32 బిలియన్ డాలర్లు, 30 బిలియన్ డాలర్లు పెరిగింది.


అయితే... ఇదంతా కూడా ట్రంప్ నిర్ణయాలు లేదా పాలనపరమైన చర్యల కారణంగా కాదని, ఆయా సంస్థల అధినేతలు తీసుకున్న సమానుకూల నిర్ణయాలు, ఇతరత్రా పరిస్థితుల కారణంగానేనని వ్యాపారరంగ నిపుణులు పేర్కొంటున్నారు. 

Updated Date - 2020-11-19T22:11:17+05:30 IST