కరోనాకు అడ్డుగోడలా ముక్కు, నోటి శ్లేష్మపొరలు

ABN , First Publish Date - 2020-12-01T08:57:52+05:30 IST

చాలామందికి లక్షణాలు బయటపడని.. తేలికపాటి నుంచి మోస్తరు కరోనా ఇన్ఫెక్షన్లే సోకడానికి గల ముఖ్య కారణం బహిర్గతమైంది.

కరోనాకు అడ్డుగోడలా ముక్కు, నోటి శ్లేష్మపొరలు

న్యూయార్క్‌, నవంబరు 30 : చాలామందికి లక్షణాలు బయటపడని.. తేలికపాటి నుంచి మోస్తరు కరోనా ఇన్ఫెక్షన్లే సోకడానికి గల ముఖ్య కారణం బహిర్గతమైంది. వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశించేది ప్రధానంగా ముక్కు, నోటి మార్గాల ద్వారానే. ఈ రెండు భాగాల శ్లేష్మపొరల్లోని రోగ నిరోధకత వల్లే కొవిడ్‌-19 ఇన్ఫెక్షన్‌ తీవ్రత గణనీయంగా తగ్గుతోందని అమెరికాలోని యూనివర్సిటీ ఎట్‌ బఫేలో శాస్త్రవేత్తలు అంటున్నారు. ఊపిరితిత్తుల కణజాలంలోకి వైరస్‌ త్వరగా చొరబడకుండా ముక్కు, నోటి భాగాల్లోని శ్లేష్మపొరల రోగ నిరోధకత ఆటంకాల్ని సృష్టించడం వల్లే.. ఇన్ఫెక్షన్ల తీవ్రత తేలికపాటి నుంచి మోస్తరుకే పరిమితం అవుతోందని పేర్కొన్నారు. ఈ అధ్యయన వివరాల ప్రాతిపదికన.. ముక్కు ద్వారా అందించే కరోనా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తే అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని వారు ఆశాభావం వ్యక్తంచేశారు. 

Updated Date - 2020-12-01T08:57:52+05:30 IST