చాణక్య నీతి: మీలో ఈ అలవాట్లు ఉంటే శత్రువులను పెంచుకున్నట్లే.. వాటిని వదిలించుకోవడం ఉత్తముల లక్షణం..

ABN , First Publish Date - 2021-11-17T12:21:19+05:30 IST

ఆచార్య చాణక్యుని పేరు ప్రాచీన కాలంలోనే కాకుండా..

చాణక్య నీతి: మీలో ఈ అలవాట్లు ఉంటే శత్రువులను పెంచుకున్నట్లే.. వాటిని వదిలించుకోవడం ఉత్తముల లక్షణం..

ఆచార్య చాణక్యుని పేరు ప్రాచీన కాలంలోనే కాకుండా ప్రస్తుత కాలంలోనూ ప్రజల నోళ్లలో నానుతుంటుంది.  ఆచార్య చాణక్య తన జీవితంలో విషయ పరిజ్ఞానం ఆధారంగా సమాజంలో తనకంటూ మంచిపేరు తెచ్చుకున్న గొప్ప దౌత్యవేత్త. చాణక్య అనేక గ్రంథాలను రచించాడు. వాటిలో మనిషి జీవితానికి సంబంధించిన అనేక విధానాలను వివరించాడు. నేటి కాలంలో కూడా ఆ జీవన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఆనందం, శ్రేయస్సును అందుకుంటాడని విశ్లేషకులు చెబుతుంటారు.


విజయం సాధించిన ప్రతి వ్యక్తికి శత్రువులు ఉంటారని చాణక్య నీతి చెబుతుంది. ఈ శత్రువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు మీకు తెలిసిన శత్రువు, మరొకరు తెలియని శత్రువు. తెలియని శత్రువును గుర్తించడం కష్టం. శత్రువు ఎలాంటివాడైనా వాని ఏకైక లక్ష్యం మీకు హాని కలిగించడం. అందుకే శత్రువుల విషయంలో ఎప్పుడూ ఉపేక్ష వహించకూడదని చాణక్య సూచిస్తున్నారు. అయితే దీనికిముందుగా శత్రువుల సంఖ్యను పెంచే గుణాలు మనలో ఉంటే వాటిని వదిలించుకోవాలని ఆచార్య సూచిస్తున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..


అహంకారం:

మనిషి ఎదుగుదలకు అడ్డుపడే పెద్ద దుర్లక్షణం అహంకారమని చాణక్య నీతి చెబుతోంది. అహకారం అనేది మనిషికి శత్రువుల సంఖ్యను పెంచుతుంది. అహంకారం లేని వ్యక్తి జీవితంలో విజయాలను అందుకుంటాడని, అటువంటివారికి అతి తక్కువ సంఖ్యలో శత్రువులు ఉంటారని చాణక్య తెలిపారు. అందుకే మనిషి అహంకారాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలని చాణక్య సూచిస్తున్నారు.

ఆడంబరం:

తమ దగ్గర డబ్బులున్నాయని గొప్పలకుపోతూ ఆడంబరాలు ప్రదర్శించకూడదని చాణక్య నీతి సూచిస్తోంది. ఇదేవిధంగా మనిషి తన గొప్పతనాన్ని, ప్రతిష్టను ఇతరుల ముందు ప్రదర్శించకూడదని చాణక్య నీతి చెబుతోంది. ఇది శత్రువుల సంఖ్యను పెంచుతుందని, వారు మీకు హాని తలపెట్టేందుకు ఇదే కారణంగా నిలుస్తుందని చాణక్యనీతి హెచ్చరిస్తోంది. అందుకే ఆడంబరాలకు దూరంగా ఉండాలని చాణక్య నీతి సూచిస్తోంది. 

Updated Date - 2021-11-17T12:21:19+05:30 IST