వీటి గూళ్లు టెన్నిస్‌ బంతులు!

ABN , First Publish Date - 2021-01-05T05:32:01+05:30 IST

ఈ ఎలుకను చూశారా! టెన్నిస్‌ బంతి గూడులో ఎంత హాయిగా ఉన్నదో. ఇంతకీ ఈ గూడు ఎలుక ఏర్పాటు చేసుకున్నది కాదు. కొందరు ఇలాంటి గూళ్లను వాటి కోసం సిద్ధం చేశారు.

వీటి గూళ్లు టెన్నిస్‌ బంతులు!

 ఈ ఎలుకను చూశారా! టెన్నిస్‌ బంతి గూడులో ఎంత హాయిగా ఉన్నదో. ఇంతకీ ఈ గూడు ఎలుక ఏర్పాటు చేసుకున్నది కాదు. కొందరు ఇలాంటి గూళ్లను వాటి కోసం సిద్ధం చేశారు. ఎందుకో తెలుసా!...


పంటచేలకు ఎలుకలు చేసే నష్టం తెలిసిందే. వాటి బెడద నుంచి తప్పించుకోవడం కోసం ఇలా టెన్నిస్‌ బంతులకు రంధ్రాలు చేసి గూడుగా మార్చేశారు బ్రిటన్‌లోని కొందరు రైతులు. 


గోధుమ, ఓట్స్‌ పంటల దగ్గర ఈ ఎలుకలు ఎక్కువగా ఉంటాయి. 

 

జంతువుల పరిరక్షణ కోసం పాటుపడే కొన్ని సంస్థలు పాత టెన్నిస్‌ బంతులను సేకరించి వాటిని ఇలా ఎలుకలకు ఆవాసాలుగా మారుస్తున్నాయి. ఎలుకలు వాటిలో నివాసం ఉంటూ సరికొత్త గూడును చూసుకొని మురిసిపోతున్నాయి. 

Updated Date - 2021-01-05T05:32:01+05:30 IST