IMD warning: పలు రాష్ట్రాల్లో 4రోజుల పాటు భారీవర్షాలు

ABN , First Publish Date - 2021-08-24T14:49:54+05:30 IST

రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది....

IMD warning: పలు రాష్ట్రాల్లో 4రోజుల పాటు భారీవర్షాలు

న్యూఢిల్లీ : రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల దేశంలోని పలు రాష్ట్రాల్లో మంగళవారం నుంచి నాలుగురోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. రుతుపవన ద్రోణి పశ్చిమ నుంచి క్రమంగా ఉత్తరం వైపునకు మారే అవకాశం ఉందని దీనివల్ల పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్రాల్లో ఆగస్టు 26,27 తేదీల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు.ఆగస్టు 27వతేదీ వరకు బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్ోల విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.


 బుధవారం వరకు అసోం, మేఘాలయ ప్రాంతాల్లోనూ భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేశారు.ఆగస్టు 27వతేదీ వరకు ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయన్ ప్రాంతాలు, పశ్చిమబెంగాల్ లలో భారీవర్షం కురుస్తుందని అధికారులు హెచ్చరించారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీవర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తన బులెటిన్ లో వివరించింది. 


Updated Date - 2021-08-24T14:49:54+05:30 IST