Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ స్టాక్స్‌... భారీ జంప్...

ముంబై : కరోనా నేపధ్యంలో తీవ్తరంగా దెబ్బతిన్న ఆతిథ్య, పర్యాటక రంగాలు మళ్ళీ కుదుటపడుతున్నాయి. ఇదే క్రమంలో... ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లో కదలిక మొదలైంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


స్టాక్ మార్కెట్ల జోరుకు ఇప్పట్లో బ్రేకులు పడేలా లేవు. ఇందుకు కారణం... మార్కెట్లలో... ప్రతికూల ట్రెండ్ పుంజుకోవడానికి ఏ కారణమూ లేకపోవడమే, ఐఅయితే... ఆర్థికవృద్ధి చెప్పుకోదగ్గ స్థాయిలో  లేకపోయినప్పటికీ...  ఈ పరిస్థితి... గాలి బుడగే అన్న ఆర్‌బీఐ వ్యాఖ్య తప్ప, మరే ప్రతికూల అంశమేదీ  ప్రస్తుతానికి లేదు. దీనికి తగ్గట్లుగా... మార్కెట్లు పతనం కాలేదు. అయితే... ఇక ఢోకా లేదనుకున్న తరుణంలోనే కరెక్షన్ చోటు చేసుకుంది. ప్రస్తుతం నిఫ్టీ 1457 వేల పాయింట్లకు దగ్గరైన వేళ, కరెక్షన్ వచ్చినా ఆల్‌టైమ్ హై అయిన 15431 పాయింట్లకు దాదాపు 270 పాయింట్ల దూరంలో మాత్రమే ఉంది. 


ఇదే సమయంలో దేశాన్ని పీడిస్తోన్న అతి పెద్ద పీడ-కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ క్రమంలో... అన్ని రాష్ట్రాల్లో వాణిజ్య కార్యక్రమాలకు ద్వారాలు తెరుస్తున్నారు. దీంతో గత మూడు నెలలుగా మూతబడిన రంగాలు తిరిగి ఆరంభమవడానికి రంగం సిద్ధమవుతోంది. అలాంటి రంగాల్లో ఆతిథ్య పర్యాటక రంగాలు ముందున్నాయి. ఈ క్రమంలో.. సంబంధిత  స్టాక్స్‌లో కదలిక మొదలైంది. 

Advertisement
Advertisement