చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నారు

ABN , First Publish Date - 2021-06-19T05:54:03+05:30 IST

న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను చట్ట ప్రకారం వాడుకుం టుంటే ఏపీ మాత్రం చట్టాలను గౌరవించడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు.

చట్టాలను వారు ఉల్లంఘిస్తున్నారు
రైతు వేదిక భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం

 వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి

ఉండవల్లి, జూన్‌ 18: న్యాయబద్ధంగా రావాల్సిన నీటి వాటాను చట్ట ప్రకారం వాడుకుం టుంటే ఏపీ మాత్రం చట్టాలను గౌరవించడంలేదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవల్లి, తక్కశిల గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాలలో ఏర్పాటు చేసిన సభల్లో ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల నిర్మాణం లో తెలంగాణ ప్రాంతానికి  తీవ్ర అన్యాయం చేశారన్నారు. రాష్ట్రం ఏర్పాటైన ఏడు సంవత్స రాల నుంచి మనం మనకు రావాల్సిన నీటి వాటాను వినియోగిం చుకుంటున్నామన్నారు.  మూడు టీఎంసీల నీటిని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అక్రమంగా తరలించడా నికి భారీ ప్రణాళికలు చేశారని అన్నారు. మనం కూడా కృష్ణానదికి ఎగువనున్నామని, మ నం తలచుకుంటే ఒక చుక్క నీరు కూడా కిందకు పోదని అన్నారు. 

రైతు సంక్షేమమే లక్ష్యం: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. రైతుల కోసం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయనటువంటి సంక్షేమ పథకా లను తెలంగాణలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులను సంఘటితం చేసి వ్యవ సాయాన్ని అభివృద్ధి చేసేందుకే రైతు వేదికలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతీ ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టరును ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రూ.572 కోట్ల నిధులతో 2,600 రైతు వేదికలను నిర్మించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 63,25,000 మంది రైతులకు, కోటీ యాభై లక్షల ఎకరాల భూమి ఉందని, శుక్రవారం నాటికి నాలుగు ఎకరాల లోపున్న 49,00,000 మంది రైతులకు సంబంధించి 81,92,000 ఎకరాలకు రైతుబంధు మొత్తం వారి ఖాతాల్లో జమ అయ్యిందన్నారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహాం మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోవిందునాయక్‌, తహసీల్దార్‌ వీరభద్రప్ప, ఎంపీడీవో జెమ్లా నాయక్‌, ఎంపీపీ బీసమ్మ, జడ్పీటీసీ సభ్యురాలు రాములమ్మ, అలంపూర్‌ మార్కెట్‌ చైర్మైన్‌ రాందేవ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పటేల్‌ విష్ణు వర్ధన్‌ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు రాజశేఖర్‌, సుంకన్న, ఉప సర్పంచు సయ్యద్‌ రహమత్‌ హుస్సేన్‌, శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-19T05:54:03+05:30 IST