‘పన్ను’ కట్టామంటారు...

ABN , First Publish Date - 2021-08-09T23:54:35+05:30 IST

గతంలో ఉన్న పన్ను విధానం ప్రకారం... డిడక్షన్ కింద ఏదైనా రావాల్సి ఉంటే ప్రభుత్వం రిఫండ్ చేసేది.

‘పన్ను’ కట్టామంటారు...

ముంబై : గతంలో ఉన్న పన్ను విధానం ప్రకారం... డిడక్షన్ కింద ఏదైనా రావాల్సి ఉంటే ప్రభుత్వం రిఫండ్ చేసేది. కాగా... ఇప్పుడు జిఎస్‌టీ తరుణంలో... అలా కాదు ఏదైనా ముడి సరుకు కొనుగోలు చేసి, ఆ తర్వాత నష్టపోయినపన్పటికీ... ఇంకేరకమైన వ్యాపారమైనా సరే... ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్(ఐటీసీ) రూపంలో వ్యాపారులకు ఆర్థికశాఖ భారీగా సమర్పించుకోవాల్సి ఉంటుంది. అయితే... దీనిని అడ్డుపెట్టుకునే కొందరు వ్యాపారులు లబ్దిపొందుతున్నారు.


ఈ క్రమంలో... ఐటీసీ పేరుతో మూడు నెలలకాలంలోనే రూ. 4 వేల కోట్లను నొక్కేశారు. మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంట్‌లో స్వయంగా ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 7,268 కేసుల్లో ఇలా ఫ్రాడ్‌ జరిగిందని, తద్వారా... రూ. 31,233 కోట్ల మేర నొక్కేసినట్లు ప్రభుత్వం గుర్తించినట్లు చెప్పారు. . ఇందులో రూ. 4 వేల కోట్ల మేర అవినీతిని జీఎస్‌టీ అధికారులు గుర్తించారని, వారికి త్వరలోనే జైలుశిక్షలు ఖాయమని పేర్కొన్నారు. కాగా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ. 175.21 కోట్లను రికవరీ చేయగా, 19 షోకాజ్ నోటీసులు  జారీ చేసినట్లు మంత్రి ప్రకటన వెల్లడిస్తోంది. 

Updated Date - 2021-08-09T23:54:35+05:30 IST