ప్రముఖ బౌద్ధ సన్యాసి తిచ్‌నాట్ హన్హ్ కన్నుమూత

ABN , First Publish Date - 2022-01-22T13:18:41+05:30 IST

ప్రభావవంతమైన జెన్ బౌద్ధ సన్యాసి తిచ్ నాట్ హన్హ్ శనివారం కన్నుమూశారు....

ప్రముఖ బౌద్ధ సన్యాసి తిచ్‌నాట్ హన్హ్ కన్నుమూత

వియత్నాం: ప్రభావవంతమైన జెన్ బౌద్ధ సన్యాసి తిచ్ నాట్ హన్హ్ శనివారం కన్నుమూశారు. ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక నాయకుడు, రచయిత, కవి, శాంతి కార్యకర్త అయిన వియత్నామీస్ జెన్ మాస్టర్ తిచ్ నాట్ హన్హ్ మృతిపై పలువురు ప్రపంచ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. తిచ్ నాట్ హన్హ్ వయసు 95 సంవత్సరాలు. అతని ఆధ్యాత్మిక ప్రయాణం ఆలయంలో ప్రారంభమైంది.‘‘వియత్నాంలోని హ్యూలోని తు హియు ఆలయంలో 95 సంవత్సరాల వయస్సులో మా ప్రియమైన గురువు థిచ్ నాట్ హన్హ్ మరణించారు’’ అని అతని అధికారిక ట్విట్టర్ తెలిపింది. గంభీరమైన రచనలతో తిచ్ నాట్ హన్హ్ పేరొందారు.తిచ్ నాట్ హన్హ్ ఎక్కువ కాలం ప్రవాసంలో గడిపారు.


 పురాతన రాజధాని నగరమైన అతని జన్మస్థలం సెంట్రల్ సిటీ హ్యూలో తన చివరి రోజులను గడపడానికి వియత్నాంకు తిరిగి వచ్చారు.పాశ్చాత్య దేశాలలో బౌద్ధమతానికి మార్గదర్శకుడిగా తిచ్ నాట్ హన్హ్ ఫ్రాన్స్‌లో ప్లమ్ విలేజ్ ఆశ్రమాన్ని స్థాపించారు. ఏడు భాషలు మాట్లాడే థిచ్ నాట్ హన్హ్ 1960ల ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రిన్స్‌టన్, కొలంబియా విశ్వవిద్యాలయాలలో ఉపన్యాసాలు ఇచ్చారు.


Updated Date - 2022-01-22T13:18:41+05:30 IST