Advertisement
Advertisement
Abn logo
Advertisement

పలు దొంగతనాల కేసుల్లో నిందితుడి అరెస్ట్‌

టంగుటూరు, డిసెంబరు 3 : టంగుటూరు, సింగరాయకొండలలో బం గారు నగల దొంగతనం కేసులో నిందితుడ్ని పోలీసులు పట్టుకున్నారు. టంగుటూరు పోతుల చెంచయ్య వెస్ట్‌కాలనీకి చెందిన నిందితుడు షేక్‌ మస్తాన్‌, అలియాస్‌ మస్తాన్‌వలిని శుక్రవారం ఉదయం టంగుటూరులోని కొండపి వెళ్లే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద ఎస్సై నాయబ్‌రసూల్‌ పట్టుకున్నారని డీఎస్పీ నాగరాజు చెప్పారు. స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో శుక్రవారం మ ధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితుడు ఈ ఏడాది ఆగస్టు 15న టంగుటూరు బస్టాండ్‌ సమీపంలో నిలిపి ఉన్న ఆటోపై మద్యం మత్తులో పెట్రోల్‌పోసి తగులబెట్టాడని వివరించారు. అదేవిధంగా అక్టోబరు 3న టంగుటూరులోని చెల్లెమ్మతోటలోని ఓ ఇంటిలోకి ప్రవేశించి 2 సవర్ల బంగారు చైను, అదేనెల 25న సింగరాయకొండలోని పెద్దమసీదు వీధిలో ఇంటి తలుపులు పగులగొట్టి బీరువా తెరిచి లాకర్‌లో ఉన్న ఐదున్నర సవర్ల బంగారు పూలహారం, ఉంగరాలు, ఐదువేల రూపాయలు దొంగిలించాడని డీఎస్పీ వివరించారు. నిందితుడ్ని పట్టుకోవడంలో సహకరించిన సింగరాయకొండ సీఐ లక్ష్మణ్‌, సింగరాయకొండ ఎస్సై సంపత్‌ పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. 

Advertisement
Advertisement