Abn logo
Mar 6 2021 @ 19:49PM

దొంగ అరెస్ట్

ప్రకాశం: జిల్లాలో పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సాధుపాటి బాలరాజు అనే వ్యక్తి చీరాల మండలంలో పలు చోరీలు చేశాడు. మండలంలోని ఈపూరుపాలెం గ్రామంలో రెండు ఇళ్ళలో నిందితుడు బాలరాజు  దొంగతనం చేశాడు. నిందితుడి నుంచి దాదాపు 30 సవర్ల బంగారు అభరణాలు, రూ.70 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.