బైక్‌ల చోరీ కేసులో దొంగ అరెస్టు

ABN , First Publish Date - 2022-01-20T04:43:11+05:30 IST

బైకులు చోరీ చేసే దొంగను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్‌ తెలిపారు.

బైక్‌ల చోరీ కేసులో దొంగ అరెస్టు
బైకులు, నిందితుడితో పోలీసులు

నందలూరు, జనవరి 19 : బైకులు చోరీ చేసే దొంగను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు ఒంటిమిట్ట సీఐ హనుమంతునాయక్‌ తెలిపారు. బుధవారం సీఐ విలేకర్లతో మాట్లాడుతూ రాజంపేట డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి ఆదేశాల మేరకు తన సూచనలతో నందలూరు హెడ్‌ కానిస్టేబుల్‌ పరమేశ్వర్‌, సిబ్బంది చెయ్యేరు వంతెన సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా రాజంపేట వైపు నుంచి కడప వైపు వెళుతున్న గొట్టు రవికుమార్‌ (27) పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారన్నారు. అతడిని విచారించగా బైకులను చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. ఎర్రగుంట్లకు చెందిన ఇతడు గతంలోనూ పలు బైకుల చోరీ కేసులతో పాటు 5 బంగారు గొలుసుల చోరీల కేసుల్లోనూ నిందితుడన్నారు. రెండు సంవత్సరాల నుంచి రాజంపేట పట్టణంలో నివాసం ఉన్నాడన్నారు. నందలూరు పట్టణం నూర్‌నగర్‌లో ఇంటి ముందు నిలిపి ఉంచిన అపాచి బైకును, కడపలో పల్సర్‌ బైకును దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు. దాదాపు 1,30,000 రూపాయలు విలువ చేసే రెండు బైకులను స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. 

Updated Date - 2022-01-20T04:43:11+05:30 IST