హైదరాబాద్‌లో దొంగ అరెస్ట్.. 3 బైకులు స్వాధీనం

ABN , First Publish Date - 2020-02-16T02:44:00+05:30 IST

రాత్రి వేళల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న షేక్ అబ్బు తాలిట్(ఫైజాన్)ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ అబ్బు తాలిట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు...

హైదరాబాద్‌లో దొంగ అరెస్ట్.. 3 బైకులు స్వాధీనం

హైదరాబాద్: రాత్రి వేళల్లో బైక్ చోరీలకు పాల్పడుతున్న షేక్ అబ్బు తాలిట్(ఫైజాన్)ను గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ అబ్బు తాలిట్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి వేళలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. పార్క్ చేసి ఉన్న ద్విచక్ర వాహనలే ఇతని టార్గెట్‌గా పెట్టుకుంటాడు. దొంగిలించిన వాహనాలను విక్రయించగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. నిందితునిపై మాదాపూర్ జోన్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. నిందితుని వద్ద నుంచి 3 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-02-16T02:44:00+05:30 IST