మళ్లీ ఉల్లి చోరీ... 550 కిలోలు మాయం!

ABN , First Publish Date - 2020-10-24T16:31:10+05:30 IST

దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి వంద రూపాయల వరకూ చేరుకునే పరిస్థితి ఏర్పడింది.

మళ్లీ ఉల్లి చోరీ... 550 కిలోలు మాయం!

ముంబై: దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి. కిలో ఉల్లి వంద రూపాయల వరకూ చేరుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రతినిత్యం ఉల్లిని తప్పనిసరిగా వినియోగించే వారంతా... ఉల్లిని తరగకుండానే కన్నీరు పెట్టుకుంటున్నారు. 


ఉల్లి ధరలు అమాంతం పెరిగిన నేపధ్యంలో ఉల్లి బస్తాల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పూణెలో గల ఒక గోదాములో నిల్వ ఉంచిన 550 కిలోల ఉల్లి చోరీకి గురయ్యింది. ఈ ఉదంతంలో ఒక దొంగను అదుపులోనికి తీసుకోగా, మరొక దొంగ పరారయ్యాడు. ఈ ఘటన పూణె పరిధిలోని దేవజలి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామంలోని రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోకి బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు గోదాములోని 38 బస్తాల ఉల్లిని చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. దీనిని గమనించిన ఒక వ్యక్తి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారన్నారు. వారంతా కలసి ఒక దొంగను పట్టుకోగా, మరొక దొంగ అక్కడి నుంచి పారిపోయాడన్నారు. 10 బస్తాల ఉల్లి మాయమైందని తెలిపారు. 


Updated Date - 2020-10-24T16:31:10+05:30 IST