Advertisement
Advertisement
Abn logo
Advertisement

దొంగకు హార్ట్ ఎటాక్! ఒక్కసారిగా అంత డబ్బు చూసి తట్టుకోలేక..

బిజ్నోర్: కొన్ని స్క్రిప్ట్‌లు సినిమాలకే పరిమితం.. నిజజీవితంలో అలా జరిగే ఛాన్సే ఉండదు అని అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి కథనం ఒకటి ఇటీవలే వాస్తవంలో ప్లే అయింది. అనుకున్నదానికంటే అధికంగా డబ్బు దొంగిలించానని తెలుసుకున్న ఓ దొంగ సంతోషానికి పట్టపగ్గాలేకుండా పోయాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సంబరాన్ని తట్టుకోలేని అతడి చిట్టి గుండె పాపం తడబడింది. దీంతో ఆ దొంగకు హార్ట్ ఎటాక్ వచ్చింది. అది చాలదన్నట్టు.. వైద్య ఖర్చులు తడిసి మోపెడవడంతో దొంగిలించిన సొమ్ములో అధిక శాతం హరించుకుపోయింది. నమ్మశక్యం కానీ ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఇటీవలే చోటుచేసుంది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నవాబ్ హైదర్ అనే వ్యక్తి నిర్వహిస్తున్న పబ్లిక్ సర్వీస్ కేంద్రంలో ఫ్రిబవరి 17న భారీ దొంగతనం జరిగింది. దొంగలు ఏడు లక్షలు దోచుకుపోయారంటూ యజామాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ఘటనకు సంబంధించి నౌషాద్, అజర్‌లను ఇటీవలే అదుపులోకి తీసుకున్నారు. తామే ఈ దొంగతనానికి పాల్పడ్డామంటూ వారిద్దరూ విచారణలో ఓప్పుకున్నారు. అంతేకాకుండా తమలో ఒకరికి హార్ట్ ఎటాక్ వచ్చిన విషయన్నీ బయటపెట్టారు. కేసును చేధించినట్టు బుధవారం నాడు ప్రకటించిన పోలీసులు.. ఈ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement