కరోనా రోగి ఇంట్లో చోరి! అర్థరాత్రి మటన్ కర్రీ వండుకున్న దొంగలు..!

ABN , First Publish Date - 2020-07-19T20:33:15+05:30 IST

అది జార్ఘఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్ నగరంలోని ఓ ప్రాంతం.. స్థానిక అధికారులు దాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అక్కడ ఓ కరోనా రోగి ఇల్లు ఉంది. అతడు ఆస్పత్రిలో ఉండటంతో భార్య పిల్లలు అత్తమామల ఇంటికి వెళ్లిపోయారు. అధికారుల ఆ ఇంటికి సీల్ వేశారు. దొంగలకు ఇదంతా బాగా కలిసొచ్చింది.

కరోనా రోగి ఇంట్లో చోరి! అర్థరాత్రి మటన్ కర్రీ వండుకున్న దొంగలు..!

జంషెడ్‌పూర్: అది జార్ఘఖండ్‌లోని జమ్‌షెడ్‌పూర్ నగరంలో  ఓ ప్రాంతం.. స్థానిక అధికారులు దాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. అక్కడ ఓ కరోనా రోగి ఇల్లు ఉంది. భర్త ఆస్పత్రిలో ఉండటంతో భార్య.. పిల్లల్ని తీసుకుని స్వగ్రామానికి వెళ్లింది. అధికారుల ఆ ఇంటికి సీల్ వేశారు. నెల రోజులుగా ఆ ఇంట్లో ఎవరూ ఉండటం లేదు. ఇదంతా దొంగలకు బాగా కలిసొచ్చింది. పక్కాగా ప్లాన్ చేసి ఆ ఇంట్లోకి గురువారం అర్థరాత్రి చొరబడ్డారు.


అదంతా కంటైన్మెంట్ జోన్ కావడంతో రాత్రిళ్లు అక్కడంతా గప్‌చుప్. ఎవ్వరూ లేరు..రారు.. కాబట్టి రాజ్యమంతా తమదే అన్నట్టు దొంగలు రెచ్చిపోయారు. అర్థారాత్రి వేళ వారందరూ కలసి మటన్ కర్రీ, చపాతీలు ఒండుకు సుష్టుగా తిన్నారు. ఆ తరువాత తీరిగ్గా రూ. 50 వేలు, అంతే విలువగల నగలు దోచుకుని జంపైపోయారు. ఆ తరువాత..సీతారామ్‌డేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని మరో రెండు ఇళ్లలోనూ విలువైన వస్తువులు శానిటైజర్లు దొంగిలించి పారిపోయారు. ఓసారి ఇల్లు ఎలా ఉందో చూసిరా అంటూ సదరు కరోనా రోగి తన తమ్ముడికి శుక్రవారం నాడు పురామించడంతో ఈ విషయం బయటపడింది. అదే రోజు అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - 2020-07-19T20:33:15+05:30 IST