Abn logo
Sep 13 2021 @ 21:43PM

ప్రమాణ స్వీకారోత్సవంలో దొంగల చేతివాటం

హన్మకొండ: జిల్లాలోని పరకాలలో వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా దొంగలు చేతివాటం చూపారు.  ఐదుగురు నాయకుల జేబులను దొంగలు కొట్టేసారు. పోలీసులకు  బాధితులు ఫిర్యాదు చేసారు. నిజాంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ నుంచి రూ.15,000, పరకాల జడ్పీటీసీ నుంచి రూ.3,500, మహేందర్‌రెడ్డి నుంచి రూ.1,500, తండా మహేష్ నుంచి రూ.15,000, సంతోష్ నుంచి రూ.8,000లను జేబుదొంగలు కాజేసారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

క్రైమ్ మరిన్ని...