తెలంగాణ ప్రభుత్వం జలచౌర్యం చేస్తుంది: తిక్కారెడ్డి

ABN , First Publish Date - 2021-06-21T22:40:37+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం కృష్ణ,గోదావరి, ట్రిబ్యునల్ నుంచి ఇష్టం వచ్చినట్లు నీటిని జలచౌర్యం చేస్తుందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జ్ తిక్కరెడ్డి అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం జలచౌర్యం చేస్తుంది: తిక్కారెడ్డి

కర్నూలు: తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి, ట్రిబ్యునల్ నుంచి నీటిని ఇష్టం వచ్చినట్లు జలచౌర్యం చేస్తుందని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జ్ తిక్కారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎప్పుడో జరగాల్సిన ఆర్డీఎస్ కుడి కాల్వ పనులు ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పారు. ఆర్డీఎస్‌పై ఆంధ్రనాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీకి రావాల్సిన 4టీఎంసీ నీటి వాటా ప్రకారమే టెండర్ వేసి కుడి కాల్వ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ విషయంపై తెలంగాణ నాయకులు గందరగోళం సృష్టించడం సరికాదన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో తాగునీటికి, రాఘవేంద్ర స్వామి అభిషేకానికి కూడా నీరు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. రైతులను దృష్టిలో పెట్టుకొని ఆర్డీఎస్ జోలికి ఎవరు రావద్దని సూచించారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగోట్టేలా నాయకులు రాజకీయాలు చేయొద్దని తిక్కారెడ్డి హితవు పలికారు. 

Updated Date - 2021-06-21T22:40:37+05:30 IST