Abn logo
Aug 2 2021 @ 00:54AM

‘తిమ్మరసు’ బిగ్‌హిట్‌ : సత్యదేవ్‌

ప్రేక్షకులతో మాట్లాడుతున్న సత్యదేవ్‌

తిరుపతి(కొర్లగుంట), ఆగస్టు 1: ‘తిమ్మరసు’ బిగ్‌హిట్‌ సాధించినందుకు ఫుల్‌జోష్‌లో ఉన్నామని ఆ సినిమా హీరో సత్యదేవ్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సినిమాను ప్రదర్శిస్తున్న తిరుపతిలోని పీజీఆర్‌ థియేటర్‌కు ఆదివారం చిత్ర నిర్మాత మహేష్‌, దర్శకుడు చరణ్‌ కాపుశెట్టి, మరో నటుడు అంకిత్‌తో కలసి వచ్చారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో మాట్లాడారు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత షూటింగ్‌ పూర్తి చేసుకున్న తన సినిమాను థియేటర్‌లోనే విడుదల చేయడానికి నిర్మాత, దర్శకుడు పట్టుబట్టారన్నారు. దానికి అనుగుణంగానే మీరూ ఆదరించారన్నారు. అనంతరం ప్రేక్షకుల కోరిక మేరకు ‘నువ్వుకొడితే సౌండ్‌ వస్తుందేమో.. లాయర్‌ కొడితే లైఫ్‌ అంతా రీ సౌండే’ అంటూ డైలాగ్‌ చెప్పారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఒక్క చిత్రంతోనే కలిగిన సంతృప్తి చిరస్మరణీయంగా ఉండిపోతుందన్నారు. ఇందులో లాయర్‌గా తన నటన ప్రేక్షకులను ఆకట్టుకుందన్నారు. థ్రిల్లింగ్‌గా ఉంటుందని భావించి సినిమా చివర్లో పాటను పెట్టామని, అదికూడా ప్లస్‌ అయ్యిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆరు కొత్త సినిమాలకు సంతకం చేశానన్నారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్‌ థియేటర్‌ అధినేత అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.