ముమ్మరం కానున్న వరినాట్లు

ABN , First Publish Date - 2022-08-08T05:09:09+05:30 IST

మండలంలో బోరు బావుల కింద వరి నారుమళ్లను పెద్దఎత్తున పెడుతున్నారు.

ముమ్మరం కానున్న వరినాట్లు
ఎస్‌ఎల్‌ గుడిపాడులో రైతులు సాగు చేసిన వరి నారుమళ్లు

బోరు బావుల కింద  నారుమళ్లు 

 పొలాలను సిద్ధం చేస్తున్న రైతులు

వంద ఎకరాలలో వరి నారుమళ్లు చేపట్టిన రైతులు

బల్లికురవ, ఆగస్టు 7: మండలంలో బోరు బావుల కింద వరి నారుమళ్లను పెద్దఎత్తున పెడుతున్నారు. అద్దంకి బ్రాంచ్‌ కెనాల్‌(ఏబీసీ)కు నీరు విడుదల కావడంతో గ్రామాలలో వరి నాట్లు పనులు ముమ్మ రం కానున్నాయి. ఇప్పటికే పలుగ్రామాలలో వంద ఎకరాలలో వరి నారును పెంచుతున్నారు. బోరు బా వుల ద్వారా నీటి వసతి ఉన్న రైతులు వరి నాట్లు వేసేందుకు దుక్కులను దమ్ము చేయిస్తున్నారు. అధిక సంఖ్యలో రైతులు మొక్కజొన్న పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నా, కొందరు రైతులు మాత్రం వరి సాగుపైనే ఆసక్తి కనబరుస్తున్నారు.

బల్లికురవ మండలంలోని వైదన, ఎస్‌ఎల్‌ గుడిపా డు, కొమ్మినేనివారిపాలెం, అంబడిపూడి, గుంటుపల్లి, వల్లాపల్లి, కొప్పెరపాడు, కొత్తూరు, కూకట్లపల్లి, ముక్తే శ్వరం, చెన్నుపల్లి, కొప్పెరపాలెం, నక్కబొక్కలపాడు, గంగపాలెం, వెలమవారిపాలెం, గొర్రెపాడు, కొత్తపా లెం గ్రామాలలో బోరు బావుల కింద వంద ఎకరాల లో వరి నారుమళ్లను పెంపకం చేపడుతున్నారు. గత పది రోజుల నుంచి అయా గ్రామాలలో వరి సాగు చేపట్టేందుకు రైతులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పలువురు రైతులు వరి విత్తనాలను తెచ్చుకొని నారుమళ్లు పోయగా, మరికొందరు సన్నద్ధమవుతు న్నారు. కొందరైతే ఎరువులను కూడా ఇళ్లల్లో నిల్వ చేసుకొన్నారు. గత ఏడాది కూడా వరి సాగుకు నీటిని విడుదల చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించకపోవ టంతో కొందరు రెతులు పంటను సాగు చేసేందుకు భయపడ్డారు. 

ఈ ఏడాది భారీ వర్షాలు కురవటం, సాగర్‌ డ్యాంకు భారీగా నీరు చేరింది. దీంతో సాగుకు నీటిని విడుదల చేయటంతో రైతులు వరి సాగు చేసేందుకు మక్కువ చుపుతున్నారు. మొక్కజొన్న పంట వేసినా, పండని పొలాల్లో వరి సాగు తప్ప మరో మార్గం లేదు. అందుకే ముందస్తుగా వరి పంట వేసేందుకు నారును పెంచుతున్నామని రైతులు తెలిపారు. సాగర్‌ కాలువల నీటి ద్వారా కాని, బోరు బావుల ద్వారా కాని మరో పదిహేనురోజులలో సుమారు రెండు వేల ఎకరాలలో వరి పంట వేసేందుకు రైతులు సిద్ధమ వుతున్నారు.  

సెప్టెంబరు మాసంలో మరో మూడు వేల ఎకరాల లో వరి నాట్లు పడనున్నాయి. మిగిలిన  భూములలో అత్యధిక శాతం రైతులు మొక్కజొన్న పంట వేయను న్నారు. కొందరు రైతులైతే  వరిని రెండు పంటలుగా కూడా సాగు చేసేందుకు ముందస్తుగా నారుపోసి నాట్లు వేయనున్నారు. ఈ ఏడాది వరి పంటను కూడా రైతులు అధిక శాతం సాగుచేసే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు.


వరి నారుమళ్లు పెంచుతున్నాం

కంచర్ల వెంకటసుబ్బారావు, వైదన

బోరు బావుల నీటి అధారంగా వరి నారుమళ్లను పెద్ద ఎత్తున పెంపకం చేపట్టాం. సాగుకు సాగర్‌ నీరు విడుద లైంది.  కాలువలకు నీరు రావడంతో కొందరు వరి నాట్లు వేయనున్నారు.  పలువురు రైతులు ఇప్పటికే వరి విత్తనాలు కొనుగోలు చేసి నారుమళ్లు సిద్ధం చేస్తున్నారు. 


15 రోజుల్లో  ముమ్మరంగా వ్యవసాయ పనులు

పసల సాయి, ఎస్‌ఎల్‌ గుడిపాడు

మరో పదిహేను రోజులలో వ్యవ సాయ పనులు ముమ్మరం కానున్నా యి. ఇప్పటికే బోరు బావుల కింద వరి నారుమళ్లు పెంపకం చేపట్టాం. గత ఏడాది సరైన అవగాహన లేక వరి పంట వే యలేక పొయాం. ఈ ఏడాది  సాగర్‌ డ్యాంకు భారీగా నీరు చేరింది. వరి పంటకు ఎలాంటి ఢాకా ఉండదు. ముందస్తుగా వరి నారును పెంచుతున్నాం. వరి పం ట సాగుకు ఎరువులు కూడా కొనుగోలు చేసి నిల్వ పెట్టాం.


Updated Date - 2022-08-08T05:09:09+05:30 IST