కొలతలకనుగుణంగా పనులు చేయించాలి

ABN , First Publish Date - 2021-06-20T06:16:09+05:30 IST

ఉపాధిహామీ పథకంలో కొలతలకు అనుగుణంగా పనిచే యిస్తేనే కూలీలకు సరైన వేతనాలు లభిస్తాయని డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి సూచిం చారు.

కొలతలకనుగుణంగా పనులు చేయించాలి

- డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి 

ధర్మవరంరూరల్‌, జూన19: ఉపాధిహామీ పథకంలో కొలతలకు అనుగుణంగా పనిచే యిస్తేనే కూలీలకు సరైన వేతనాలు లభిస్తాయని డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి సూచిం చారు. శనివారం మండలంలోని రేగాటిపల్లి వద్ద ధర్మవరం క్లస్టర్‌ పరిధిలోని 88 పం చాయతీలకు చెందిన ఉపాధిహామీ ఫీల్డ్‌అసిస్టెంట్లుకు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. శిక్షణాధికారులుగా ఏపీడీ విజయ్‌కుమార్‌, ధర్మవరం ఏపీడీ పుల్లారెడ్డిలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ కూలీలకు కొలతలకు త గ్గట్టుగా రోజు వారీ కూలి రూ. 245 అందేవిధంగా పనులు చేయించాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఫారంపాండ్లు, ట్రెంచపనులు,  చెరువు పూడికతీతలు, రోడ్డుకు ఇరువైపులా మొ క్కలు నాటడం, మట్టి రోడ్లు  వేయించడం వంటి పనులు కల్పించాలన్నారు. ఈశిక్షణలో  కొ లతలపై ఫీల్డ్‌అసిస్టెంట్లు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు వివిధ మండలాల ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెం ట్లు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T06:16:09+05:30 IST