పనులను వేగవంతం చేయాలి

ABN , First Publish Date - 2021-06-22T05:14:54+05:30 IST

అప్రోచ్‌ రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ ఏఈ అనీల్‌శాస్త్రికి సూచించారు.

పనులను వేగవంతం చేయాలి
అప్రోచ్‌ రోడ్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న ఎస్పీ రంజన్‌రతన్‌ కుమార్‌

- ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌

గద్వాలక్రైం, జూన్‌ 21 : అప్రోచ్‌ రోడ్డు పనులను వేగవంతం చేయాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ ఏఈ అనీల్‌శాస్త్రికి సూచించారు. గద్వాల - ఎర్రవల్లి ప్రధాన రహదారి నుంచి కలెక్టర్‌ కార్యాలయాన్ని కలుపుతూ పీజీపే క్యాంపులో నిర్మిస్తున్న జిల్లా పోలీస్‌ కార్యాలయం వరకు వేయనున్న అప్రోచ్‌ రోడ్డు మ్యాప్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎన్ని ఫీట్ల వెడల్పు రోడ్డు వేయాలి, కార్యాలయం ముందు ఏర్పాటు చేయనున్న తోట విస్తీర్ణం తదితర విషయాలను ఈఏ అనీల్‌శాస్ర్తి ఎస్పీకి వివరించారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ సత్యనారాయణ, ఆర్‌అండ్‌బీ ఏఈ కిరణ్‌ తదితరులు ఉన్నారు.


పోలీస్‌ ప్రజావాణికి 14 ఫిర్యాదులు

గద్వాల పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 14 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో భూ వివాదాలకు సంబంధించి ఆరు, ఆర్థిక పరమైనవి మూడు, కులం పేరుతో దూషించిన అంశంపై ఒక ఫిర్యాదు వచ్చిందని ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌ తెలిపారు. బోగస్‌ కంపెనీ ద్వారా మోసం చేశారని మరొకటి, భర్త వేదింపులకు సంబంధించినవి రెండు, ఇతర అంశాలకు సంబంధించి ఒక ఫిర్యాదు వచ్చిందని తెలిపారు.


Updated Date - 2021-06-22T05:14:54+05:30 IST