సన్నగిల్లుతున్న ప్రజాసంబంధాలు

ABN , First Publish Date - 2021-01-11T05:41:20+05:30 IST

రామగుండం నగరపాలక సంస్థలో రోజురోజుకూ ప్రజాసంబంధాలు సన్నగిల్లుతున్నాయి. యంత్రాంగం వైఖరితో పాలకవర్గం నిధు లు, అభివృద్ధిపై చెప్పుకోలేని దుస్థితి నెలకొన్నది.

సన్నగిల్లుతున్న ప్రజాసంబంధాలు
రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం

 నిధులు, అభివృద్ధిపై చెప్పుకోలేని పరిస్థితిలో రామగుండం కార్పొరేషన్‌ యంత్రాంగం 

 ఆరోపణలు వస్తున్నా నోరుమెదపని వైనం 

 పాలకవర్గానికి, యంత్రాంగానికి మధ్య అగాథం

కోల్‌సిటీ, జనవరి 10: రామగుండం నగరపాలక సంస్థలో రోజురోజుకూ ప్రజాసంబంధాలు సన్నగిల్లుతున్నాయి. యంత్రాంగం వైఖరితో పాలకవర్గం నిధు లు, అభివృద్ధిపై చెప్పుకోలేని దుస్థితి నెలకొన్నది. కార్పొరేషన్‌కు ఏ నిధులు మంజూరవుతున్నాయి, ఏ పను లు జరుగుతున్నాయో కూడా ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ప్రభుత్వం నుంచి వచ్చే నిధు లు, అభివృద్ధి పనులు తదితర విషయాలపై పాలకవ ర్గ పెద్దలు ప్రజలకు వివరించేవారు. యంత్రాంగం ఎ ప్పటికప్పుడు పాలకవర్గంతో సంప్రదిస్తూ పనులు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయా యి. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా, కొత్తగా వాహనాలు కొనుగోలు చేసినా, ఏ ఇతర పథకాలు వ చ్చినా పాలకవర్గం ప్రజలకు వివరించే పరిస్థితిలో లేదు. ఇందుకు యంత్రాంగానికి, పాలకవర్గానికి మధ్య ఉన్న అగాథమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. ప్ర చార సాధనాలకు దూరంగా ఉండాలనే అభిప్రాయం తో ఉన్న పెద్దలు తాము చేస్తున్న పని ప్రజలకు తెలియాలనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో కార్పొరేషన్‌లో ఏం జరుగుతోంది, పాలకవర్గం ఏం చే స్తోందనే విషయం బయటకు తెలియని పరిస్థితి ఉం ది. దీని వల్ల పాలవకవర్గంపైనే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. సాధారణంగా ఏ మాత్రం నిధు లు మంజూరైనా ప్రజాప్రతినిధులు ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తారు. దీనికోసం యంత్రాంగం పా లకవర్గ పెద్దలకు ప్రతి విషయాన్ని ఎప్పకప్పుడు తెలియజేస్తుంది. కనీసం అధికారులు పాలకవర్గంలోని సభ్యులకు కానీ, పెద్దలకు గానీ సమన్వయం ఉన్న పరిస్థితులు లేవు.

విభాగాల్లో ఎవరికి వారే...


రామగుండం నగరపాలక సంస్థలోని వివిధ విభాగాల్లో ఎవరికి వారే అనే రీతిలో పాలన సాగుతోంది. పాలకవర్గానికి కానీ, ప్రజలకు గానీ జవాబుదారీగా ఉండాలనే విషయాన్ని యంత్రాంగం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అధికారుల వైఖరిపై ఇప్పటి కే పలువురు ప్రజాప్రతినిధులు బహిరంగంగానే ఆగ్ర హం వ్యక్తం చేశారు. సాధారణంగా రామగుండంలో కమిషనర్‌ మొదలు శానిటరీ సూపర్‌వైజర్ల వరకు ఉదయం 5గంటలకే పారిశుఽద్యాన్ని పర్యవేక్షించడం ఆనవాయితీ. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక ఇంజనీరింగ్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో ఎవరు లోకల్‌లో ఉన్నారో, ఎవరు నాన్‌ లోకల్‌లో ఉన్నారో తెలియని పరిస్థితి. అధికారుల సమాచారం కాంట్రాక్టర్లకు మినహా కార్పొరేటర్లకు కూడా తెలిసే పరిస్థితి లేదు. కీలక విభాగాలకు చెందిన కొందరు అధికారులు, ఉద్యోగులు బినామీ కాంట్రాక్టర్లుగా అవతారమెత్తారనే విమర్శలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 

రామగుండం నగరపాలక సంస్థలో పాలకవర్గం ఉన్నా యంత్రాంగానిదే పైచేయి అన్న విధంగా వ్యవహారాలు సాగుతున్నాయి. అత్యవసర పనులకు సం బంధించి నామినేషన్లు ఇచ్చే విధానాన్ని అడ్డుపెట్టుకుని యంత్రాంగం ఇష్టానుసారంగా నామినేషన్ల విధానాన్ని కొనసాగిస్తున్నది. ఏడాది కాలంలో ఇంజనీరింగ్‌, హరితహారం, శానిటేషన్‌, టౌన్‌ ప్లానింగ్‌ విభాగాల్లో వివిధ పనుల పేర ఇష్టానుసారంగా నామినేషన్లు ఇచ్చినట్టు తెలుస్తున్నది. సాధారణంగా అత్యవసరాల పేర ఏ పనులు చేయించినా వాటిని తిరిగి కౌన్సిల్‌లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సమాచారం ఇచ్చుకునే పరిస్థితే లేదనే విమర్శలున్నాయి.

ఆరోపణలపై నోరు మెదపని యంత్రాంగం..


నగరపాలక సంస్థలో వివిధ విభాగాల పని తీరు పై ఆరోపణలు వస్తున్నా యంత్రాంగం నోరు మెదపడం లేదు. విభాగాల పని తీరుతో పనుల్లో జాప్యాలు జరిగి నానా రకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల పాత మున్సిపల్‌ కార్యాలయ స్థలం కబ్జా జరుగుతుందంటూ ఆరోపణలు వచ్చి ఆందోళనలు కూడా జరిగా యి. టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీకి నగరపాలక సంస్థకు మధ్య సమన్వయ లోపంతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ని ర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. ఈ విషయాన్ని కానీ, కబ్జాలకు ఆస్కారం లేదని యంత్రాంగం ప్రజల కు తెలియజేయకపోవడంతో పాలవకర్గం వైపు ప్రజ లు వేలు ఎత్తిచూపే పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-01-11T05:41:20+05:30 IST