ఫస్ట్ క్లాస్ గోవాలో థర్డ్ క్లాస్ నేతలు ఉన్నారు: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2021-12-22T00:15:49+05:30 IST

గోవా ఫస్ట్ క్లాస్ రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ నేతలు ఏలుతున్నారు. గోవాకు ఇంకా మంచి రాజకీయ నాయకులు కావాలని నేను అనుకుంటున్నాను. గోవాలో ఇప్పటి వరకు ఉన్న పార్టీలే దేశంలోనూ ఉన్నాయి..

ఫస్ట్ క్లాస్ గోవాలో థర్డ్ క్లాస్ నేతలు ఉన్నారు: కేజ్రీవాల్

పనాజీ: గోవా ఫస్ట్ క్లాస్ రాష్ట్రమని అయితే అక్కడ థర్డ్ క్లాస్ నేతలు ఉన్నారని భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్. గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం పనాజీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార బీజేపీ సహా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.


‘‘గోవా ఫస్ట్ క్లాస్ రాష్ట్రం. కానీ ఈ రాష్ట్రాన్ని థర్డ్ క్లాస్ నేతలు ఏలుతున్నారు. గోవాకు ఇంకా మంచి రాజకీయ నాయకులు కావాలని నేను అనుకుంటున్నాను. గోవాలో ఇప్పటి వరకు ఉన్న పార్టీలే దేశంలోనూ ఉన్నాయి. ఈ 60 ఏళ్లలో అవినీతిని వారేమైనా అంతం చేయగలిగారా? కానీ మేము అధికారంలోకి రాగానే గోవాను అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తాం’’ అని కేజ్రీవాల్ అన్నారు.

Updated Date - 2021-12-22T00:15:49+05:30 IST