Mumbai Test: విరాట్ కోహ్లీ డకౌట్‌పై వివాదం

ABN , First Publish Date - 2021-12-03T22:53:37+05:30 IST

న్యూజిలాండ్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టులో కోహ్లీ అనూహ్య రీతిలో డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు

Mumbai Test: విరాట్ కోహ్లీ డకౌట్‌పై వివాదం

ముంబై: న్యూజిలాండ్‌తో ఇక్కడి వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి టెస్టులో కోహ్లీ అనూహ్య రీతిలో డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఆడిన స్కిప్పర్ అజాజ్ బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే, బంతి కోహ్లీ ప్యాడ్‌కు తాకుతూ వెళ్లిందని భావించిన అంపైర్ అనిల్ చౌదరి వేలిని పైకెత్తాడు. అయితే, అది అవుట్ కాదని భావించిన కోహ్లీ రివ్యూకు వెళ్లాడు. రివ్యూలో బంతి బ్యాట్ ఇన్‌సైడ్ ఎడ్జ్‌కు తాకుతూ వెళ్లినట్టు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ టీవీ అంపైర్ వీరేందర్ శర్మ కూడా అవుట్‌గా ప్రకటించడం వివాదాస్పదమైంది. కోహ్లీ కూడా అసంతృప్తిగానే మైదానాన్ని వీడాడు.


అంపైర్ల తీరుపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కోహ్లీ అవుట్‌పై సీబీఐ విచారణ అవసరమని ఒకరంటే, కోహ్లీని అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్‌ను కటకటాల వెనక్కి నెట్టాలని మరొకరు డిమాండ్ చేశారు. ఇంకో నెటిజన్ అయితే థర్డ్ అంపైర్‌ను గాంధారితో పోల్చాడు. పార్థివ్ పటేల్, వసీం జాఫర్ కూడా ఇది పూర్తిగా అంపైర్ తప్పిదమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-03T22:53:37+05:30 IST