కడదరకుంటలో దాహం.. దాహం..!

ABN , First Publish Date - 2021-07-29T06:24:00+05:30 IST

కడదరకుంట గ్రామంలో 20 రోజులుగా నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది. గ్రామానికి నీటిని సరఫరా చేసే తాగునీటి బోర్లు చెడిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది.

కడదరకుంటలో దాహం.. దాహం..!
చెడిపోయిన బోరు

కూడేరు, జూలై 28 :  కడదరకుంట గ్రామంలో 20 రోజులుగా నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చింది.  గ్రామానికి నీటిని సరఫరా చేసే తాగునీటి బోర్లు చెడిపోవడంతో ఈ దుస్థితి నెలకొంది. పంచాయతీ అధికారులు ట్యాంకర్లతో సరఫరా చేస్తున్నా.. అవి ఏ మూలకూ సరిపోవడం లేదు. సత్యసాయి నీటితో పాటు గ్రామంలోకి మోటార్లతో నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం దళితవాడ, బీసీ కాలనీ, రోడ్డు పక్కనున్న కాలనీల ప్రజలు తాగునీటికి అల్లాడిపోతున్నారు. నీళ్ల కోసం మహిళలు, వృద్ధులు ఘర్షణకు దిగే దుస్థితి ఏర్పడింది. పనులకు వెళ్లకుండా నీళ్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. తాగునీటి కష్టాలు తీర్చడానికి అధికారులు ఏ మాత్రం చొరవ చూపడం లేదని మహిళలు మండిపడుతున్నారు.


Updated Date - 2021-07-29T06:24:00+05:30 IST