మువ్వన్నెల రెపరెపలు

ABN , First Publish Date - 2022-01-27T05:15:46+05:30 IST

జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడు కలను బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు.

మువ్వన్నెల రెపరెపలు
క్యాంపు కార్యాలయం వద్ద జెండావందనం చేస్తున్న ఎమ్మెల్యే చిట్టెం

- ఘనంగా గణతంత్ర వేడుకలు 

- ఆయా ప్రభుత్వ కార్యాలయాల వద్ద జెండాలను ఆవిష్కరించిన అధికారులు

- పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు 

- కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా వేడుకల నిర్వహణ

నారాయణపేట, జనవరి 26 : జిల్లా వ్యాప్తంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడు కలను బుధవారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించి ఘనంగా జరుపుకున్నారు. నారా యణపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌ హరిచందన, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వెంకటేశ్వర్లు, మునిసిపాలిటీలో చైర్‌ పర్సన్‌ అనసూయ, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయ సహకార సంఘంలో అధ్యక్షుడు నరసింహరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సింగిల్‌ విండో ఉపాధ్యక్షుడు విజయ్‌, డైరెక్టర్లు, సీఈవో వేణుగోపాల్‌, డీసీసీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి, టీడీపీ కార్యాలయంలో మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్‌ జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి, నా యకులు అబ్దుల్‌ సలీం, సర్ఫరాజ్‌, బండి వేణుగోపాల్‌, శరణప్ప, లిఖి రఘు, మహిమూద్‌ ఖురేషి, రవీందర్‌రెడ్డి, సదా శివారెడ్డి, సరిత, సతీష్‌, సలీం, రమేష్‌, గోపాల్‌ రెడ్డి, యూసూఫ్‌, అనిల్‌, అఖిల్‌, టీడీపీ నా యకులు వినయ్‌మిత్ర, రాఘవరావు చౌద్రి, ఓంప్రకాష్‌, యాబన్న, శ్రీకాంత్‌, వీరన్న, నారాయణ, బన్నప్ప, కిష్టప్ప పాల్గొన్నారు. 

ఏబీవీపీ ఆధ్వర్యంలో..

నారాయణపేట చౌక్‌లో ఏబీవీపీ జిల్లా కన్వీనర్‌ రామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండా లతో సత్యనారాయణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నా యకులు నాగూరావు నామాజీ, రతంగ్‌ పాండురెడ్డి, శ్రీనివాసులు, రఘు, శ్రవణ్‌, ఏబీవీపీ నరేష్‌, గంగాధర్‌, వెంకట రమణ, చరణ్‌, ఇంతియాజ్‌, అభిషేక్‌, నవీన్‌, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

నారాయణపేట రూరల్‌ : నారాయణపేట మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల ముందు సర్పంచులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో సందీప్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించగా ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుగుణ, జడ్పీటీసీ అంజలి పాల్గొన్నారు.

ధన్వాడ : మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో బుధవారం పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేసి మిఠాయిలను పంపిణీ చేశారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పద్మిబాయి, గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ చిట్టెం అమరేందర్‌రెడ్డి, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయు డు రమేష్‌తో పలు కార్యాలయాల్లో ఆయా అధికారులు జెండా ఎగురవేశారు. 

నర్వ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద మువ్వనెల జెండాను ఆయా కార్యాలయాల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎగుర వేశారు. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డీటీ వాసు దేవరావ్‌, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ విజయభాస్కర్‌, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ జయరాములు శెట్టి, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్‌ సంధ్య, సింగిల్‌ విండో వద్ద చైర్మన్‌ బంగ్ల లక్ష్మికాంతారెడ్డి, అంబే డ్కర్‌, గాంధీ విగ్రహం వద్ద దండు అయ్యప్ప, రవీందర్‌రెడ్డి, ఏపీజీవీబీ బ్యాంకు వద్ద మేనేజర్‌ ఆంజనేయులు, పశు వైద్యశాల వద్ద డాక్టర్‌ అశోక్‌కుమార్‌, రైతు వేదిక వద్ద ఏఈవో మహేష్‌, మండల మహిళా స మాఖ్య వద్ద సంతోష ఎగురవేయగా ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు గౌని జ్యోతి, వైస్‌ ఎంపీపీ వీణావతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, విండో వైస్‌ చైర్మన్‌ లక్ష్మన్న, నాయకుడు శంకర్‌ పాల్గొన్నారు. 

కృష్ణ : గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సురేష్‌, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పూర్ణిమ, జిల్లా పరిషత్‌ ఉన్నతలో నిజామొద్దిన్‌, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగరాజు, వ్యవసాయ శాఖలో మహేష్‌, మండల విద్యాశాఖలో నిజామొద్దిన్‌, అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు వినోద్‌, కేజీబీవీ పాఠశాలలో ఎస్‌ఓ షాలిని, ఏపీవో కార్యాలయంలో వెంకట య్య, పంచాయతీ కార్యాలయంలో సర్పంచు రాధ జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ సభ్యురాలు అంజనమ్మ, ఆర్‌ఐ వెంకట్రాములు, వీఆర్వోలు రామారావు, మదన్‌మోహన్‌రెడ్డి, ఏఈ వోలు అభిలాష్‌, మానస, సునీల్‌, ఉపాధ్యాయులు, నాగరాజుగౌడ్‌, గోపాల్‌, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎంపీవో విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు శారద, రామచంద్ర, వైస్‌ ఎంపీపీ ఈశ్వర్‌గౌడ పాల్గొన్నారు.

మాగనూరు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ తిరుపతయ్య, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయంపై ఎంపీపీ శ్యామలమ్మ, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచు రాజు, వ్యవసాయ కార్యాలయం వద్ద ఏవో హరిత, సింగిల్‌ విండో కార్యాలయం వద్ద వెంకట్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్‌ శ్రీమంత్‌, లైబ్రరీ వద్ద కృష్ణయ్య, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వద్ద హెచ్‌ఎం శివరాజ్‌, మార్గ దర్శి విద్యాలయం వద్ద అధ్యక్షుడు ప్రహ్లద్‌ రెడ్డి, ప్రతిభా నికేతన్‌ వద్ద హెచ్‌ఎం కలప, అంబేడ్కర్‌ విగ్రహం వద్ద లక్ష్మణ్‌ జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఆర్‌ఐ నరసింహులు, ఎంపీవో జైపాల్‌రెడ్డి, నాయకులు మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచు ఆనంద్‌ గౌడ్‌, నరసింహరెడ్డి, చెన్నప్ప, ఏపీఎం రా మలింగం, ఏపీవో సత్యప్రకాష్‌ పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల, కార్యాలయాల ముందు జెండాను ఎగరవేశారు. ఎంపీడీవో కార్యాలయం ముందు ఎంపీడీవో యశోదమ్మ, తహసీల్దార్‌ కార్యాలయం ముందు డీటీ జగన్‌నాయక్‌, సీఐ కార్యాలయం వద్ద సీఐ శివకుమార్‌, స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ అశోక్‌బాబు, గ్రంఽఽథాలయం వద్ద పాలకుడు మల్లికార్జున్‌ జెండా ఎగుర వేశారు. ఆయా కార్యక్ర మాల్లో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సురేఖరెడ్డి, ఎంపీపీ శ్రీకళ, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, ఎం పీటీసీ సభ్యురాలు సుజాత, గోపాల్‌, కో అప్షన్‌ మెంబర్‌ మతీన్‌ పాల్గొన్నారు. కాగా మండలంలోని ఎల్లిగండ్ల గ్రామంలో పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన గణతంత్ర వేడుకలకు వార్డు సభ్యులు గైర్హా జరైనట్లు ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షు డు, బీజేపీ నాయకుడు వడ్డే శ్రీరామ్‌ పేర్కొ న్నారు. గ్రామంలో పది మంది వార్డు సభ్యులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారని రాని వారిపై సంబంధిత అఽధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

మక్తల్‌ రూరల్‌ : మండలంలోని పంచదేవపహాడ్‌, సోమేశ్వరబండ, వనాయకుంట, ముసలాయిపల్లి, మాదన్‌పల్లి, చిన్న గోప్లాపూర్‌, అంకెన్‌పల్లితో పాటు అన్ని గ్రామాల్లో బుధవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాల వద్ద జెండాను ఆవిష్కరించారు. మక్తల్‌ ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో శ్రీధర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సర్పంచులు కల్పన, కృష్ణచారి, మంజుల, వెంకటన్న, లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మక్తల్‌ : 73వ గణతంత్ర వేడుకలను పట్టణంలో బుధవారం ఘనంగా ని ర్వహించారు.  ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. తహసీల్దార్‌ కార్యాలయం లో తహసీల్దార్‌ మజర్‌అలీ, మార్కెట్‌ కార్యాలయం వద్ద చైర్మన్‌ రాజేష్‌గౌడ్‌, సీఐ కార్యాలయం వద్ద సీఐ శంకర్‌, మునిసిపల్‌ కార్యాలయం వద్ద కమిషనర్‌ రాజయ్య, ఎంపీడీవో, వ్యవసాయ, సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం, పోలీస్‌స్టేషన్‌, ఎమ్మార్సీ వద్ద ఎంఈవో, బాలుర ఉన్నత పాఠశాల వద్ద జీహెచ్‌ ఎం అనిల్‌గౌడ్‌ జెండాను ఆవిష్కరించారు. ఆజాద్‌నగర్‌ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు, అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మాజీ జడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వి.శ్రీహరి, గణేష్‌కుమార్‌, బి.నర్సిములు, లయన్సు క్లబ్‌ సభ్యులు రమేష్‌రావు, అంబ దాస్‌, చంద్రకాంత్‌గౌడ్‌, కర్నిస్వామి, బీజేపీ నాయకులు కొండయ్య, కల్లూరి నాగప్ప, రాజశేఖర్‌రెడ్డి, రహీంపటేల్‌, దేవరింటి నర్సింహారెడ్డి, సూర్య ఆంజనేయులు, మంజునాథ్‌, సుధాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మహిపాల్‌రెడ్డి, రామలింగం పాల్గొన్నారు. 

ఊట్కూర్‌ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం తహసీల్దార్‌ కార్యాలయం ముందు తహసీల్దార్‌ తిరుపతయ్య, మండల పరిషత్‌ కార్యాలయం ముందు ఎంపీపీ లక్ష్మి, పోలీస్‌స్టేషన్‌ మందు ఎస్‌ఐ పర్వతాలు, ఎమ్మార్సీ ముందు ఎంఈవో వెంకటయ్య, వ్యవసాయ కార్యాలయం ముందు ఏవో గణేష్‌రెడ్డి, ఐకేపీ కార్యాలయం వద్ద ఏపీఎం నర్సిములు, ఆసుపత్రిలో డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డి, సింగిల్‌ విండో కార్యాలయం మందు అధ్యక్షుడు బాల్‌రెడ్డి, పంచాయతీ కార్యాలయం ముందు కార్యదర్శి సుమలత, పాఠశాలల వద్ద హెచ్‌ఎంలు, గ్రామాల్లో సర్పంచ్‌లు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మండలంలోని పులి మామిడి ఆసుపత్రి వద్ద డాక్టర్‌ నరేష్‌చం ద్ర, పంచాయతీ కార్యాలయం ముందు సర్పంచ్‌ సూరయ్యగౌడ్‌ జెండాను ఎగురవేశారు. చిన్నపొర్ల, ఎడవెల్లి, నిడుగుర్తి, ఊట్కూర్‌ పాఠశాల విద్యార్థులు స్వాత్రంత్ర సమర యోధుల వేషాధరణలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు అశోక్‌ కుమార్‌గౌడ్‌, ఎంపీటీసీ హన్మంతు, సర్పంచ్‌ సూర్యప్రకాస్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ రహెమాన్‌ పాల్గొన్నారు.

దామరగిద్ద : మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలతో పాటు యువజన సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.  పోలీస్‌స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ గోవర్ధన్‌, గ్రామ పంచాయతీ వద్ద ఆశమ్మ, ఎస్‌బీఐ బ్యాంకు వద్ద మేనేజర్‌ రవి, ఎమ్మార్సీ వద్ద కాంప్లెక్స్‌ ప్రధానోపాఽ ద్యాయురాలు జ్యోతి, ఎఆర్వో వెంకటేష్‌, ఎంపీడీవో శశికళ, విండో కార్యాలయం వద్ద పుట్టి ఈదప్ప, మహిళా సమైఖ్య భవనం వద్ద మహిళా సమైఖ్య అధ్యక్షురాలు సత్య మ్మతో పాటు ఆయా యువజన సంఘాల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచ్‌ ఆశమ్మ,, ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, అశోక్‌, శ్రీనివాస్‌ ఉన్నారు. 

కోస్గి : 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను మండలంలో ఘనంగా జరుపుకున్నారు. కోస్గి మునిసిపాలిటీలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మ్యాకల శిరీష జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత  అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగం అమలుతో దేశ ప్రజల తలరాతలు మారాయన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ, కౌన్సిలర్‌లు, కో అప్షన్‌ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మునిసిపల్‌ కమిషనర్‌, సిబ్బంది, విద్యార్థులు, మునిసిపల్‌ కార్మికులు పాల్గొన్నారు. అదే విధంగా పట్టణంలోని మున్నూర్‌వీఽధిలో చిన్నారులు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 




Updated Date - 2022-01-27T05:15:46+05:30 IST