రేపటి నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు

ABN , First Publish Date - 2021-05-14T05:28:59+05:30 IST

కడప నుంచి విశాఖకు వెళ్లే తిరుమల స్పెషల్‌ (07487) రైలు ఈ నెల 15 నుంచి జూన్‌ 1 వరకు రద్దు అయిందని కడప రైల్వేస్టేషన్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.అమర్‌నాధ్‌ తెలిపారు.

రేపటి నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు

కడప(ఎర్రముక్కపల్లె), మే 13: కడప నుంచి విశాఖకు వెళ్లే తిరుమల స్పెషల్‌ (07487) రైలు ఈ నెల 15 నుంచి జూన్‌ 1 వరకు రద్దు అయిందని కడప రైల్వేస్టేషన్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.అమర్‌నాధ్‌ తెలిపారు. విశాఖపట్టణం నుంచి కడపకు వచ్చే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ (07488) రైలు శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు రద్దు జరిగిందన్నారు. రిజర్వేషన్‌ చేసుకున్న ప్రయాణికులకు వారి టికెట్‌ డబ్బులు రైల్వే రీఫండ్‌ చేస్తుందన్నారు.

 

Updated Date - 2021-05-14T05:28:59+05:30 IST