Abn logo
Sep 19 2021 @ 06:50AM

బ్రహ్మోత్సవాలకు శ్రీవారి ఆలయం ముస్తాబు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. అక్టోబరు ఏడు నుంచి 15వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో భక్తులు, సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వాహనసేవలను ఆలయంలోని కల్యాణ వేదికలోనే నిర్వహించను న్నారు. వాహన సేవలు ఆలయంలో నిర్వహిస్తున్నప్పటికీ తిరుమలలో పండు గ వాతావరణం నెలకొనేలా కొద్దిపాటి ఏర్పాట్లు చేయాలని అధికారులు నిర్ణ యించారు. ఇందులో భాగంగా శ్రీవారి మహద్వార గోపురానికి ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. తర్వాత విద్యుత్‌ అలంకరణలు చేస్తారు. రద్దీ ప్రాంతాల్లోనూ అలంకరణలు చేయనున్నారు. 


పలు ప్రదేశాల్లోని భవనాలకూ రంగులు వేస్తారు. ఏడో తేదీన ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి. రాత్రికి పెద్దశేష వాహన సేవ, 8న ఉదయం చిన్నశేషవాహన సేవ, రాత్రి హంసవాహన సేవను నిర్వహిస్తారు. అలాగే 9న సింహవాహ నం, రాత్రి ముత్యపు పందిరి, 10న ఉదయం కల్పవృక్షవాహనం, రాత్రి సర్వ భూపాల వాహనం, 11న మోహినీ అవతారం, రాత్రి గరుడవాహనసేవ, 12న ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వ భూపాల వాహనం, రాత్రి గజవాహనసేవలను నిర్వహిస్తారు. 13న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 14న ఉదయం రథం బదు లుగా సర్వభూపాల వాహనం, రాత్రి అశ్వవాహనం, చివరిరోజు 15వ తేదీన ఉదయం చక్రస్నానం నిర్వహించి, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాల ను పూర్తిచేయనున్నారు. 11వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుమల కు చేరుకుని ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు.