రూ.10 లక్షలకు పడిపోయిన శ్రీవారి హుండీ ఆదాయం

ABN , First Publish Date - 2021-05-15T09:35:36+05:30 IST

రూ.10 లక్షలకు పడిపోయిన శ్రీవారి హుండీ ఆదాయం

రూ.10 లక్షలకు పడిపోయిన శ్రీవారి హుండీ ఆదాయం

తిరుమల, మే 14 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ ప్రభావంతో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.10 లక్షలకు పడిపోయింది. కరోనా కేసుల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాదాపు 20 వేల మందికి దర్శన ఏర్పాట్లు చేసినప్పటికీ చాలా మంది భక్తులు శ్రీవారి దర్శనాన్ని వాయిదా వేసుకుంటున్నారు. ఈ క్రమంలో గడిచిన వారం రోజులుగా శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య 5 వేలకు లోపే ఉంది. ఈ క్రమంలోనే హుండీ ఆదాయం కూడా భారీగా తగ్గిపోయింది. 11వ తేదీన రూ.11లక్షలు, 12న రూ.17లక్షలు హుండీ ద్వారా ఆదాయం సమకూరగా... గురువారం కేవలం రూ.10 లక్షలు మాత్రమే ఆదాయం వచ్చినట్టు శుక్రవారం టీటీడీ తెలిపింది.

Updated Date - 2021-05-15T09:35:36+05:30 IST