Abn logo
Jul 5 2020 @ 05:32AM

జోమాటో డెలివరీ బాయ్‌కు కరోనా..అలర్ట్

తిరువనంతపురం (కేరళ): కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో జోమాటో డెలివరీ బాయ్‌కు కరోనా సోకడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కేరళ రాజధాని నగరమైన తిరువనంతపురంలో ఒక్కరోజే ఓ మెడికల్ రిప్రజెంటేటివ్, ఓ పోలీసు అధికారికి కరోనా సోకింది. 24 గంటల్లో 240 కరోనా కేసులు వెలుగుచూడటంతో తిరువనంతపురంలో హైఅలర్ట్ ప్రకటించారు.తిరువనంతపురం నగర శివార్లలోని పలయం మార్కెట్ సమీపంలోని లాడ్జీలో నివాసముంటున్న జోమాటో డెలివరీ బాయ్ (37)కు కొవిడ్ లక్షణాలు కనిపించడంతో అతన్ని పరీక్షించారు. డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ అని రావడంతో అతన్ని ఐసోలేషన్ చేశారు. కజాకొట్టాం ప్రాంతంలోని పలు ఆసుపత్రులను సందర్శించిన 27 ఏళ్ల మెడికల్ రిప్రజెంటేటివ్ కు కరోనా సోకిందని తేలడంతో ఆయా ఆసుపత్రుల్లో వారు కలవరపడ్డారు. తిరువనంతపురం సచివాలయంలో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీసు అధికారికి కూడా కరోనా సోకింది. కేరళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు కలవరపడుతున్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement