Abn logo
Oct 21 2020 @ 23:42PM

తిరువీర్‌ ‘పరేషాన్‌’

Kaakateeya

‘జార్జ్‌ రెడ్డి’ బయోపిక్‌లో లలన్‌ సింగ్‌ పాత్రలో, ‘పలాస 1978’లో రంగారావుగానూ తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు తిరువీర్‌. ‘సిన్‌’ వెబ్‌ సిరీస్‌లో హీరోగానూ నటించారు. ఇప్పుడీ నటుడు  సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో నిర్మిస్తున్న సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ‘కొబ్బరిమట్ట’ దర్శకుడు రూపక్‌ రోనాల్డ్‌సన్‌ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘పరేషాన్‌’ అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ మంచిర్యాలలో పూర్తి చేశారు. సింగరేణిలో పనిచేసే ఉద్యోగి కుమారుడిగా తిరువీర్‌ కనిపించనున్నారని తెలిసింది. ఈ చిత్రానికి ‘చౌరస్తా’ బ్యాండ్‌ సంగీతం అందిస్తోంది. 

Advertisement
Advertisement