Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ బ్యాంకు వడ్డీ... ఇంతే...

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగానికి చెందిన రెండో అతిపెద్ద బ్యాంక్... పంజాబ్ నేషనల్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించింది. ఈ క్రమంలో... రుణ గ్రహీతలకు ఊరట కలగనుంది. తక్కువ వడ్డీ రేటుకే రుణాలు లభిస్తాయి. వివరాలిలా ఉన్నాయి. 


పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)... రుణ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు సమాచారమిచ్చింది. ఈ క్రమంలో... ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 0.05 శాతం మేర తగ్గింది. దీంతో ఏడాది ఎంసీఎల్ఆర్ 7.3 శాతానికి దిగివచ్చింది. కొత్త రేట్లు... ఈ రోజు(జూన్ 1)నుంచే అమల్లోకొచ్చాయి. అంతేకాకుండా...  బ్యాంక్ ఆరు నెలల ఎంసీఎల్ఆర్ రేటును 0.1 శాతం మేర తగ్గించేసింది. అలాగే మూడు నెలల ఎంసీఎల్ఆర్ రేటులో కూడా ఇదే స్థాయిలో కోత విధించింది. బ్యాంకులు ఏడాది ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన కస్టమర్లకు రుణాలు జారీ చేస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. 


Advertisement
Advertisement