Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది

జన్మదినం సందర్భంగా ఎంపీ సంతోష్‌ ట్వీట్‌

 సీఎం కేసీఆర్‌తో ఉన్న అనుబంధాన్ని తెలిపే ఫొటో ట్యాగ్‌

హైదరాబాద్‌,  డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ‘ఈ పుట్టుక నాది.. బతుకంతా మీది..’ అనే క్యాప్షన్‌తో తన చిన్న వయసులో సీఎం కేసీఆర్‌తో దిగిన ఫొటోను రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. కేసీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని ఫొటో ద్వారా తెలియజేశారు. మంగళవారం సంతోష్‌ జన్మదినం సందర్భంగా చేసిన ఈ పోస్ట్‌పై పలువురు స్పందించారు. కేసీఆర్‌ అభిమానులు, సంతోష్‌ స్నేహితులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతోపాటు సందేశాలను పంపారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంపీ సంతో్‌షకుమార్‌.. మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ సంతో్‌షకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 

Advertisement
Advertisement