ఈ కాఫీ రేంజే వేరు...

ABN , First Publish Date - 2020-12-18T05:30:00+05:30 IST

పొద్దున్నే లేచిన వెంటనే వేడి వేడి కాఫీ తాగితే ఉండే కిక్కే వేరు. కాఫీ ప్రియులకు ‘రేజ్‌ కాఫీ’ ఎక్స్‌ట్రా కిక్‌ ఇస్తుంది. ఈ కాఫీలో చాలా విశేషాలే ఉన్నాయి.

ఈ కాఫీ రేంజే వేరు...

పొద్దున్నే లేచిన వెంటనే వేడి వేడి కాఫీ తాగితే  ఉండే కిక్కే వేరు. కాఫీ ప్రియులకు ‘రేజ్‌ కాఫీ’ ఎక్స్‌ట్రా కిక్‌ ఇస్తుంది. ఈ కాఫీలో చాలా విశేషాలే ఉన్నాయి.  ఇది సహజసిద్ధమైన మొక్క నుంచి తయారైనదని. ఇందులో షుగర్‌, ప్రిజర్వేటివ్స్‌, యాడిటివ్స్‌, ఆర్టిఫీషియల్‌ కలర్స్‌ ఉండవని, గ్లూటన్‌ ఫ్రీ, వేగాన్‌  ఫ్రెండ్లీ అని చెబుతున్నారు దీన్ని తయారుచేస్తున్న భరత్‌ సేథీ. మూడు రకాల ఫ్లేవర్స్‌లో ఈ కాఫీ లభిస్తుంది. ఇందులో ఐరిష్‌ హేజిల్‌నట్‌, క్రీమ్‌ కారమిల్‌, స్పార్కీ ఆరంజ్‌ ఫ్లేవర్స్‌ ఉన్నాయి.


పైగా ఈ కాఫీని కప్పులో కాకుండా మట్టి జార్స్‌లో దీన్ని అందిస్తున్నారు. స్వీట్లు ఇష్టపడే వారికి క్రీమ్‌ కారమిల్‌ సూపర్‌గా నచ్చుతుందిట. ఈ కాఫీ చేదు లేకుండా వినూత్నమైన సువాసనతో మైమరపిస్తుంది. ఈ కాఫీలో స్పెషల్‌ స్పార్కీ ఆరంజ్‌. ఎందుకంటే కాఫీలో సిట్రస్‌ రుచి తేవడం మహా కష్టం. అది వీళ్లు సాధించారు మరి. సమీప భవిష్యత్తులో పిప్పరమెంట్‌, బబుల్‌గమ్‌ ఫ్లేవర్స్‌ కాఫీలు అందుబాటులోకి తేవాలనే ఆలోచనలో ఉన్నామని చెబుతున్నారు భరత్‌. కొత్త రుచిని ఆస్వాదించాలనుకునే వారికి ఇక పండగే మరి. 

Updated Date - 2020-12-18T05:30:00+05:30 IST