ఈ ఏడాదిలో సుజుకీ క్రేజీ బైక్‌... ధర ఎంతంటే...

ABN , First Publish Date - 2021-04-07T01:52:47+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉన్న సుజుకీ హయాబుసా నుంచి మరో కొత్త బైక్‌ రానుంది. ‘సుజుకీ హయాబుసా 2021’ కొత్త ఎడిషన్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేసే అవకాశాలున్నాయి.

ఈ ఏడాదిలో సుజుకీ క్రేజీ బైక్‌... ధర ఎంతంటే...

చెన్నై : ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ ఉన్న సుజుకీ హయాబుసా నుంచి మరో కొత్త బైక్‌ రానుంది. ‘సుజుకీ హయాబుసా 2021’ కొత్త ఎడిషన్‌ను ఈ ఏడాది జూలైలో విడుదల చేసే అవకాశాలున్నాయి. వాహన తయారీ రంగంలో సుజుకీకి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన హయాబుసా టూ వీలర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా సుజుకీ హయాబుసాకు ఉన్న క్రేజ్‌ అంతాఇంతా కాదు. ఈ క్రమంలోనే తాజాగా 2021 సుజుకీ హయాబుసా రానుంది. ఈ ఏడాదిలో భారత మార్కెట్‌లోకి ఈ సెన్సేషన్‌ బైక్‌ రానుంది. దీన్ని బీఎస్‌6 ఇంజన్‌తో రూపొందించారు.


ఈ బైక్‌ 9700 ఆర్‌పీఎమ్‌ వద్ద 187 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. గరిష్టంగా 299 కి.మీల వేగంతో దూసుకెళ్లగలదు. పవర్‌ మోడ్‌ సెలక్టర్‌, ఇంజన్‌ బ్రేక్‌ కంట్రోల్‌ సిస్టం, యాంటీ థెఫ్ట్ కంట్రోల్‌ సిస్టం, మోషన్‌ ట్రాక్‌ ట్రాక్షన్ కంట్రోల్‌ సిస్టం, బై డైరెక్షనల్‌ షిప్ట్‌ సిస్టం వంటి అధునాతన ఫీచర్లు ఈ బైక్‌ సొంతం. ఈ బైక్‌ ఎక్స్‌ షోరుమ్‌ ధర ఏకంగా రూ. 20 లక్షలు. జూలైలో ఈ బైక్‌ రోడ్డు మీదకొచ్చే అవకాశాలున్నాయి. ఇక ఈ బైక్‌ను సొంతం చేసుకోవాలంటే ప్రస్తుతం రూ. 2-5 లక్షల వరకు టోకెన్‌ అమౌంట్‌ ఇవ్వాల్సి ఉంటుందసమాచారం. 

Updated Date - 2021-04-07T01:52:47+05:30 IST