ఈ కోడిగుడ్డు ప్రత్యేకం!

ABN , First Publish Date - 2020-02-27T05:20:10+05:30 IST

కోడిగుడ్డు మీద చిన్న రంధ్రం చేయాలని చూస్తేనే అంది పగిలిపోతుంది. అలాంటిది కోడిగుడ్డు మీద ఏకంగా 12 వేల సూక్ష్మ రంధ్రాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు టర్కీకి చెందిన హమిత్‌ హయ్‌రన్‌. 62 ఏళ్ల హమిత్‌కు కోడిగుడ్డు...

ఈ కోడిగుడ్డు ప్రత్యేకం!

కోడిగుడ్డు మీద చిన్న రంధ్రం చేయాలని చూస్తేనే అంది పగిలిపోతుంది. అలాంటిది కోడిగుడ్డు మీద ఏకంగా 12 వేల సూక్ష్మ రంధ్రాలు చేసి సరికొత్త రికార్డు సృష్టించారు టర్కీకి చెందిన హమిత్‌ హయ్‌రన్‌. 62 ఏళ్ల హమిత్‌కు కోడిగుడ్డు మీద బొమ్మలు వేయడం అంటే చాలా ఇష్టం. పని చేస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంతో ఇంటికే పరిమితం అయిన ఆయన కోడిగుడ్డు పెంకుల మీద బొమ్మలు వేయడం మొదలెట్టాడు.


ఇప్పటివరకూ వివిధ దేశాల నేతల ఫొటోలు, జంతువుల చిత్రాలు చాలానే గీశారాయన. ప్రపంచంలోనే ఈ తరహా విద్య వచ్చిన కొద్దిమంది ఆర్టిస్ట్‌ల్లో ఒకడిగా గుర్తింపు సాధించారు కూడా. గతంలో ఈ రికార్డు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి 8,708 సూక్ష్మ రంధ్రాలు చేసి రికార్డు నెలకొల్పాడు. ఆ రికార్డును హమిత్‌ హయ్‌రన్‌ 12వేల రంధ్రాలు చేసి బద్దలుకొట్టాడు. 


Updated Date - 2020-02-27T05:20:10+05:30 IST