ఈ ఫ్యాన్‌ గాలి తుఫాను కన్నా వేగవంతం!

ABN , First Publish Date - 2020-11-04T06:08:26+05:30 IST

అవును! మీరు చదివింది నిజమే. ఈ ఫ్యాన్‌ గాలి తుఫాను సమయంలో వీచే గాలి కన్నా ఎక్కువ వేగవంతంగా ఉంటుంది.

ఈ ఫ్యాన్‌ గాలి తుఫాను కన్నా వేగవంతం!

అవును! మీరు చదివింది నిజమే. ఈ ఫ్యాన్‌ గాలి తుఫాను సమయంలో వీచే గాలి కన్నా ఎక్కువ వేగవంతంగా ఉంటుంది. వాల్‌ ఆఫ్‌ విండ్‌ అని పిలిచే ఈ అతి పెద్ద విండ్‌ సిమ్యులేటర్‌ను ఇంజనీర్లు తయారుచేశారు. ఇది గంటకు 157 మైళ్ల వేగంతో గాలిని ఉత్పత్తి చేయగలదు. ఈ గాలి వేగం ఐదు హరికేన్లు వచ్చినపుడు వీచే గాలితో సమానం. 

 హరికేన్ల సమయంలో వీచే బలమైన గాలుల నుంచి రక్షణ కోసం ఈ అతిపెద్ద ఫ్యాన్‌లను రూపొందించారు. 

 ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీలోని ఇంటర్నేషనల్‌ హరికేన్‌ రీసెర్చ్‌ సెంటర్‌, కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ కంప్యూటింగ్‌కు చెందిన ఇంజనీర్లు సంయుక్తంగా పరిశోధన చేసి ఈ వాల్‌ ఆఫ్‌ విండ్‌ను తయారుచేశారు.

 అత్యంత శక్తిమంతమైన ఈ ఫ్యాన్‌లను రూపొందించడానికి ఇంజనీర్లు పదిహేను సంవత్సరాల పాటు శ్రమించారు. 


Updated Date - 2020-11-04T06:08:26+05:30 IST