Abn logo
Mar 26 2020 @ 22:19PM

ఇది గుర్తింపు కోసం చేస్తున్న సాయం కాదు: అల్లరి నరేష్

‘‘మనిషిగా.. కష్టం వచ్చినప్పుడు.. అందరం అందరికోసం నిలబడలేకపోవచ్చు. కానీ ప్రతీ ఒక్కరూ పక్కవారి కోసం ఎంతో కొంత చెయ్యగలం’’ అన్నారు అల్లరి నరేష్. క‌రోనా వైర‌స్‌(కోవిడ్ 19) నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్ ఇప్ప‌టికే త‌మ వంతు సాయంగా విరాళాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. తాజాగా అల్లరి నరేష్ కూడా ప్రస్తుతం తను చేస్తున్న చిత్ర నిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి తన చిత్రయూనిట్‌లో ఉన్న 50 మందికి పైగా కార్మికులకు రూ. 10 వేలు చొప్పున ఇస్తున్నట్లుగా తెలియజేశారు. 


ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్ 19 నివారణ కోసం జరిగే ఈ 21 రోజుల లాక్ డౌన్ వల్ల మా ‘నాంది’ యూనిట్‌లో రోజూవారి వేతనంతో జీవనం సాగించే 50 మందికి పైగా ఉన్న మా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండాలని, మా యూనిట్ తరుపున నేను.. మా నిర్మాత సతీష్ వేగేశ్నగారు కలిసి, ప్రతి ఒక్కరికి తలా 10 వేల రూపాయలు సాయం అందించాలని నిర్ణయించుకున్నాం. ఇది గుర్తింపుకోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం. ఈ సాయం కావాలి.. మరిన్ని సాయాలకు ‘నాంది’..’’ అని తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement