Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 30 2021 @ 11:09AM

బీజేపీది తాలిబన్ మనస్తత్వం: శివసేన విమర్శలు

ముంబై: హర్యానాలో రైతులపై పోలీసుల పాశవిక దాడి దేశానికే సిగ్గుచేటని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ అన్నారు. ఇలాంటి చర్యలు తాలిబన్ల మనస్తత్వానికి ప్రతీకలని, హర్యానా ప్రభుత్వం అలాగే వ్యవహరించిందని ఆయన అన్నారు. పేదలు, రైతుల గురించి ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడుతుందని ఆయన ప్రశ్నించారు. హర్యానాలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపై శనివారం స్థానిక పోలీసులు లాఠీచార్జి చేశారు. పోలీసులు తీవ్రంగా కొట్టడంతో చాలా మంది తీవ్రంగా రైతులు రక్తమోడారు.


ఈ విషయమై సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘‘రైతులపై జరిగిన దాడి దేశానికే సిగ్గు చేటు. ఇంత దుర్మార్గంగా కిరాతకంగా వ్యవహరించడమేంటి? ఇది తాలిబన్ మనస్తత్వం. వాళ్లు కూడా ఇంతే అమానవీయంగా వ్యవహరిస్తారు. ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ పేదలు, రైతులు అని ఈ ప్రభుత్వం ఎలా మాట్లాడగలుగుతుంది? రైతులు ఇన్ని నెలలుగా నిరసన చేస్తున్నప్పటికీ ప్రధాని తన మన్‌ కీ బాత్‌లో ఒక్కసారి కూడా రైతుల గురించి మాట్లాడలేదు’’ అని హర్యానా, కేంద్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.

Advertisement
Advertisement